Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ (Tollywood) ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో నిర్మాతల బృందం చర్చించింది. పారదర్శక విధానం కోసం ఆన్ లైన్ విధానం కావాలని, సినిమా టికెట్ల రేట్లు పెంచమని తామే కోరామన్నారు.

సినీ పరిశ్రమలోని పలు సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ (Tollywood) ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నేతృత్వంలో నిర్మాతల బృందం చర్చించింది. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే తాము మంత్రి నాని (Perni Nani)ని కలిసినపుడే ఇటు నిర్మాతలకుకానీ, అటు ప్రభుత్వానికి కానీ పారదర్శక విధానం కోసం ఆన్ లైన్ విధానం కావాలని, సినిమా టికెట్ల రేట్లు పెంచమని తామే కోరామన్నారు. గత సమావేశంలో ఇదే విషయం చర్చించాం. ప్రభుత్వం బీ ఫామ్ లైసెన్స్ రెన్యూవల్ చేసేటపుడు అన్ని థియేటర్లలకు ఆ సూచనలు ఇస్తే..ఆన్ లైన్ విధానం అమల్లోకి రావాలనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాం. అందుకు మంత్రి సానుకూలంగా స్పందిచారని..అయితే చర్చల సానుకూల అంశాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని, అందువల్లే ప్రస్తుత పరిణామాలు నెలకొన్నాయని దిల్ రాజు అన్నారు.
సినిమా అనేది చాలా సున్నితమైనది. సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ విధానం ఎలా ఉండబోతుందో స్పష్టత ఇవ్వాలని ఈ సమావేశంలో మంత్రి నానిని కోరినట్టు వెల్లడించారు. రాబోయే సమావేశాల్లో ఆన్ లైన్ విధానం ఎలా రాబోతుందనే దానిపై క్లారిటీ వస్తుందని చెప్పారు దిల్ రాజు.
మరోవైపు ఆన్లైట్ టికెటింగ్ విధానం (Online Ticketing System) కొత్తగా పెట్టింది కాదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానానికి అనుకూలంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి నాని స్పష్టం చేశారు. చెప్పారు. ఒక వ్యక్తి వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఏకాభిప్రాయంగా తీసుకోబోమని పవన్ కల్యాణ్ నుద్దేశించి అన్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dil raju
- perni nani
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

