వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ఉంటుంది. కొందరికేమో దెయ్యాలంటే వణుకు. మరికొందరికేమో బొద్దింకలంటే దడ. వీటన్నిటినీ చూసి మరికొందరికి సిల్లీగా అనిపిస్తుంటుంది. ప్రపంచ ప్రముఖుల మొదలు.. నిరుపేదల వరకూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ఉంటుంది. మరి, మన హీరోయిన్ల భయాలేమిటో చూద్దామా..

మూడు ముళ్లే..
‘అన్నపూర్ణ మ్యారేజెస్’ ,‘అవును’, ‘అవంతిక’… వంటి చిత్రాల్లో నటించి, గుర్తింపును తెచ్చుకున్నది నటి పూర్ణ. తనకు ‘గామోఫోబియా’. అంటే పెండ్లి, కమిట్మెంట్ అంటే చచ్చేంత భయం. ఆ భయంలో అర్థం ఉంది. ఇటీవలే పూర్ణను, ఆమె కుటుంబాన్ని పెండ్లి పేరిట ఓ ముఠా మోసం చేసింది. ఎక్కడో తేడాకొట్టి వరుడి గురించి ఆరా తీయడంతో విషయం తెలిసింది. ఆ నకిలీ వరుడిని పోలీసులకు అప్పగించింది పూర్ణ. లక్కీగా ఆ పెండ్లి పీటలవరకూ రాలేదు. కానీ, వివాహం అంటేనే భయమేస్తుందని చెబుతున్నది పూర్ణ.

ఫోను చుట్టూ..
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ‘నోమోఫోబియా’. తనకు తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ, తన ఫోనుకు మాత్రం నిత్యం చార్జింగ్ ఉండాల్సిందే. ఎక్కడి కెళ్లినా చార్జింగ్, సిగ్నల్ కోసం క్షణానికోసారి చెక్ చేసుకుంటూ ఉంటుందట ప్రియాంక. సెల్‌ఫోన్ మీద మితిమీరిన ధ్యాస ఉంటే ‘నోమోఫోబియా’ బారిన పడినట్టే. ఈకాలం పిల్లల్లో చాలామందికి ఈ మనో వ్యాధి లక్షణం ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఓ సారి చెక్ చేసుకోండి.

బాబోయ్ బ్యాక్టీరియా!
కంటికి కనిపించని శత్రువు.. బ్యాక్టీరియా అంటే హన్సికకు చచ్చేంత భయమట. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని ఆమె భయం. అందుకే తాను నటించే సినిమాల్లో లిప్‌లాక్‌కు చాలా దూరంగా ఉంటుందీ అమ్మడు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు.. ఎవరి దగ్గర ఎటువంటి బాక్టీరియా ఉందో ఎవరికి ఎరుక? అందుకే, ముద్దు సీన్లకు ఈ భామ ముందే కట్ చెప్పేస్తుంది.

పక్షులను చూడగానే..
తమిళ, తెలుగు భాషల్లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ భామకు ‘ఆర్నిథోఫోబియా’ ఉంది. పక్షులను చూస్తే విపరీతమైన భయం ఈ వ్యాధి లక్షణం. అదనంగా, ఎక్కడ కరుస్తాయోననే అనుమానం. ఈ భయాన్ని అధిగమించేందుకు కాజల్ విశ్వ ప్రయత్నాలు చేసింది. పావురాలను పెంచుకొని, వాటికి కబుర్లు చెప్పి, పండ్లు తినిపించి.. చివరికి కొంత భయాన్ని పోగొట్టుకుంది కాజల్.

ఆ ఆకారాలంటే..
‘నాకు ట్రిపోఫోబియా ఉంది. కొన్ని ఆకారాల్ని, వస్తువుల్ని చూడగానే తెలియకుండానే నాలో భయం ప్రవేశిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా’ అని తన భయాన్ని బయట పెట్టేసింది సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి. ‘ట్రిపోఫోబియా’ అంటే? చిన్నచిన్న రంధ్రాలు, వికారంగా అనిపించే గడ్డలు, ఆకారాలు చూసినప్పుడు భయంతో కూడిన విరక్తి కలగడం. హఠాత్తుగా వీటిని చూసినప్పుడు టిపోఫోబియా ఉన్నవారికి భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చెమటలు పడతాయి. వణుకు మొదలైపోతుంది.

కొండలంటే దడ!
కొండలు, పర్వతాలు, భవనాలు, చెట్లు.. ఇలా ఆకాశాన్ని తాకేలా కనిపించే ఎత్తయిన వాటిని చూస్తే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. పై నుంచి కిందికే కాదు, కింది నుంచి పైకి చూసినా.. హార్ట్‌రేట్ అమాంతం పెరిగిపోతుంది. అందుకే వాటి జోలికే వెళ్లనని అంటున్నదీ అమ్మడు. ‘ఆక్రోఫోబియా’ అంటే, ఎత్తయిన వాటిని చూస్తే కలిగే భయం. ఇటువంటి భయాల్ని పోగొట్టడానికి మనస్తత్వ నిపుణులు స్కైడైవింగ్, బంగీజంపింగ్ వగైరా సాహస విన్యాసాలు సిఫార్సు చేస్తుంటారు.

ఎవరేమంటారో..
శరీర సౌష్ఠవం విషయంలో హేళనలను ఎదుర్కొనేవారు ఓ రకమైన భయాందోళనకు గురికావడమే ‘బాడీ డిస్మార్ఫియా డిజార్డర్’ (బీడీడీ). ఈ విషయంతో జీరోసైజ్ సుందరి ఇలియానాను ఎంతోమంది ఆటపట్టించారట. ఆమె నడుమందాల గురించి హేళన చేసేవారట. అయితే, ఇప్పుడా బాధలేదని అంటున్నదీ గోవా సుందరి. బాలీవుడ్లో ‘బిగ్బుల్’ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన ఇలియానా.. తన కెరీర్ తొలినాళ్లలో బీడీడీ బారినపడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

