మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఎన్నో కోట్ల మందికి ఇష్టం. ఆయనంటే ప్రాణమిచ్చే అభిమానులున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి.. ఈ రోజు మెగాస్టార్ స్థాయికి వచ్చాడంటే ఆయన కష్టం మామూలుగా ఉండదు. పగలు రేయి నిద్ర మాని పడిన కష్టాలే సాధారణ శివశంకర వర ప్రసాద్‌ను కోట్లాది మంది ఆరాధించే చిరంజీవిగా మార్చేశాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవికి సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమా హీరోల వరకు అభిమానులు ఉన్నారు. కానీ మరి మన మెగాస్టార్‌కు ఇష్టమైన హీరో ఎవరు తెలుసా? ఆయన ఎవరిని అమితంగా అభిమానించేవాడో తెలుసా? ఆ స్టార్ ఎవరో కాదు.. సూపర్ స్టార్ కృష్ణ.

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే సమయానికే కృష్ణ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. సాహసమే ఊపిరి అంటూ అద్భుతమైన సినిమాలు చేస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. అలాంటి సమయంలో చిరు ఇండస్ట్రీకి వచ్చాడు. కేవలం చిరంజీవికే కాదు నాగబాబుకు కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే ఇష్టమే. చిరంజీవి, నాగబాబులు చదువుకునే రోజుల్లో కృష్ణ సినిమాలను నేల టిక్కెట్ కొనుక్కొని చూసేవాళ్లు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే కూడా ఎక్కువగా సూపర్ స్టార్‌ను అభిమానించే వాడు చిరంజీవి. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక ఆయనతోనే కలిసి రెండు మూడు సినిమాలు చేశాడు మెగాస్టార్. మెగా బ్రదర్స్‌కే కాదు వాళ్ల తండ్రి కొణిదెల వెంకట్రావుకు కూడా సూపర్‌స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టం. కృష్ణ అన్న.. ఆయన సినిమాలు అన్న చాలా ఇష్టపడేవారు. నిజానికి వెంకట్రావుకు నటుడు కావాలని ఎంతో తపన ఉండేది. కానీ నాటి కుటుంబ పరిస్థితుల కారణంగా కుదర్లేదు. అందుకే కొడుకును హీరో చేశాడు వెంకట్రావు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్రీకాంత్ -ఊహా కూతురు వెండితెరకు పరిచయం కాబోతుందా?
Bigg boss 5 | అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా.. వార్తలు నిజమేనా..?
పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త చెప్పిన బండ్ల..ఇక ఆ రోజు సందడే సందడి..!
RRR: అఖిల్ సినిమా రిలీజ్ డేట్‌తో ఆర్ఆర్ఆర్ వాయిదాపై వచ్చిన క్లారిటీ..!
భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

