Taapsee: భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న తాప్సీ ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సమాజంలో జరిగే సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఓ రేప్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాప్సీ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేసింది. ఈ తీర్పుపై తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అత్యాచారం కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అయ్యింది. ‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ తాప్సీ అసహనం వ్యక్తం చేశారు.
చట్టబద్ద వివాహంలో భార్యతో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. వైవాహిక అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్ధోషిగా ప్రకటించింది. అదే సమయంలో భార్యతో అతడు జరిపిన అసహజ శృంగార చర్యలను నేరంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై ఇక గాయని సోనా మొహపాత్ర కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ‘ఇది చదివిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Taapsee Pannu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

