Bigg boss 5 | అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా.. వార్తలు నిజమేనా..?
Bigg boss 5 | బిగ్ బాస్ 5 తెలుగు ఇంకా మొదలు కాలేదు.. కానీ అప్పుడే వార్తల్లో మాత్రం నిలుస్తుంది. ఈ షో కోసం నిర్వాహకులు చాలా కష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా పరిస్థితుల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని బిగ్ బాస్ మొదలు పెడుతున్నారు. ఇప్పటికే కన్నడ, హిందీలో కొత్త సీజన్ మొదలై ముగిసిపోయాయి కూడా. సెప్టెంబర్ 5 నుంచి తెలుగులో ఐదో సీజన్ మొదలు కానుంది. దీని కోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 26 నుంచి కంటెస్టెంట్స్ అందరూ క్వారంటైన్‌కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంట్లోకి పంపించనున్నారు నిర్వాహకులు. కానీ ప్రస్తుతం ఈ షోకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే క్వారంటైన్‌కు పంపించిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా కూడా నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ వార్తలు వస్తున్నాయి.
గతేడాది కూడా గంగవ్వతో పాటు సింగర్ నోయల్‌కు వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. వాళ్లు క్వారంటైన్ ముగించుకొని నెగిటివ్ రిపోర్ట్ తీసుకొని ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈసారి 16 మందిని కాకుండా 19 మంది కంటెస్టెంట్స్‌ను నిర్వాహకులు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే షో మొదలయ్యే సమయానికి ఎవరైనా వైరస్ బారిన పడ్డా కూడా 16 మందిని పంపించి మిగిలిన వాళ్లను ఆప్షన్స్ కింద పెట్టినట్లు తెలుస్తోంది. వాళ్లను కూడా ఒకటి రెండు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఇచ్చి లోపలికి పంపించనున్నారు.

హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ క్వారంటైన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 4న వాళ్లు క్వారంటైన్ నుంచి బయటికి రానున్నారు. ఆ మరుసటి రోజు సీజన్ 5 మొదలు కానుంది. మరోవైపు ఈ షోపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలు కానుంది. డిసెంబర్ వరకు ఈ సీజన్ కొనసాగనుంది. వరుసగా మూడోసారి కూడా బిగ్‌బాస్ షోకి నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నాడు. గత సీజన్ వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారమైన బిగ్ బాస్ ఈసారి రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. వీకెండ్ టెలికాస్ట్ సమయం మాత్రం మారలేదు. ఈ మార్పుతో టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్రీకాంత్ -ఊహా కూతురు వెండితెరకు పరిచయం కాబోతుందా?
పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త చెప్పిన బండ్ల..ఇక ఆ రోజు సందడే సందడి..!
RRR: అఖిల్ సినిమా రిలీజ్ డేట్‌తో ఆర్ఆర్ఆర్ వాయిదాపై వచ్చిన క్లారిటీ..!
భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!
బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!


