రాజశేఖర్ కూతుళ్ళు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా..?

Rajasekhar daughters | తెలుగు ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ హీరోల వారసులు సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ వారసురాళ్లకు మాత్రం ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి మోహన్ బాబు వరకు ఎంతో మంది హీరోలు కూతుళ్లు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. మెగా డాటర్ నిహారికకు కూడా నిరాశ తప్పలేదు. ఈమె చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. దాంతో పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. మంచు లక్ష్మీ కూడా హీరోయిన్ గా కాకుండా కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయింది. ఇలాంటి సమయంలో హీరో రాజశేఖర్ కూతుళ్లు ఇండస్ట్రీ సెంటిమెంట్ మార్చడానికి మ్యాగ్జిమం ట్రై చేస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ఈ మధ్యే శివాని రాజశేఖర్ ( shivani rajasekhar ) హీరోయిన్గా నటించిన తొలి సినిమా అద్భుతం విడుదలైంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా హాట్ స్టార్ డిస్నీలో విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా శివానీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. చిరంజీవి నుంచి ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు రాజశేఖర్ పెద్ద కూతురు నటన చూసి ప్రశంసించారు. కచ్చితంగా ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని ఆశీర్వదించారు.
మరోవైపు అక్క కంటే రెండు సంవత్సరాల ముందే హీరోయిన్ అయిపోయింది శివాత్మిక రాజశేఖర్ ( shivatmika rajasekhar ) . విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది రాజశేఖర్ చిన్న కూతురు. సినిమా ఫ్లాప్ అయినా కూడా శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈమె రెండు సినిమాలు చేస్తోంది. మరోవైపు శివాని రాజశేఖర్ కూడా తెలుగు, తమిళంలో అవకాశాలు దక్కించుకుంటుంది. రెండు మూడు మంచి విజయాలు వస్తే కచ్చితంగా ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా సెటిల్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jeevitha rajasekhar | తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం
Shivatmika Rajasekhar| గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో కూతురు
siva sankar master | చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో కరోనా మరణం.. తస్మాత్ జాగ్రత్త..
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

