siva sankar master | చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో కరోనా మరణం.. తస్మాత్ జాగ్రత్త..

siva sankar master | కరోనా వైరస్ తగ్గిపోయింది మునుపటిలా జోరు చూపించడం లేదు.. వచ్చినా కూడా ఈజీగా వెళ్లిపోతుంది.. ప్రాణాలు తీసే పవర్ ఇప్పుడు ఈ మహమ్మారి దగ్గర లేదు అంటూ చాలా మంది బాగా ఫ్రీ అయిపోయారు. కరోనా వైరస్ ఒకటుంది అనే విషయాన్ని కూడా అందరూ మర్చిపోతున్నారు. కానీ తాను ఇంకా ఉన్నాను అని గుర్తు చేసే పనిలో పడింది ఈ మహమ్మారి. చాలా అంటే చాలా రోజుల తర్వాత మరో లెజెండ్ ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ కాటుకు బలైపోయారు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఈ వైరస్ కారణంగానే కన్నుమూశారు.
ఆయనతో పాటు ఎంతో మంది యువ దర్శకులు, టెక్నీషియన్స్ కూడా గత ఏడాది కాలంగా మరణిస్తూనే ఉన్నారు. ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ కూడా మహమ్మారికి బలైపోయాడు. గత కొద్ది నెలలుగా ఈ వైరస్ కారణంగా ఎవరూ మరణించడం లేదు. దాంతో ఊపిరి పీల్చుకున్నారు సినీ ప్రముఖులు. సరిగ్గా ఇలాంటి సమయంలో మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. 800 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేసిన లెజెండరీ డాన్స్ మాస్టర్ శివ శంకర్ కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. ఇటీవలే ఆయన వైరస్ బారిన పడ్డారు. ఆయనతో పాటు కుటుంబంలో మరో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.
పెద్ద కొడుకు పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉంది. ఆయనకు కూడా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక ఆయన భార్యకు కూడా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే ఉండిపోయింది. దాదాపు 80 శాతం లంగ్స్ ఇన్ఫెక్షన్ తో నవంబర్ 28 సాయంత్రం ఆయన మరణించారు. శివ శంకర్ మాస్టర్ మరణవార్త తెలుసుకున్న వెంటనే టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన మరణం కంటే కూడా.. ఇది కరోనా మరణం కావడంతో మరోసారి భయానక పరిస్థితులు మొదలయ్యాయి. వైరస్ లేదు కదా అని ఆదమరిస్తే దాని ఫలితం ఊహించని విధంగా ఉంటుందని శివశంకర్ మాస్టర్ మరణం అందరినీ ఆలోచనలో పడేసింది. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మరోసారి కరోనా వైరస్ పేరు శివ శంకర్ మాస్టర్ కారణంగా బలంగా వినిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
shiva shankar master | టాలీవుడ్లో మరో విషాదం.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sivasankar Master : శివశంకర్ మాస్టర్ కొడుకులు ఏ రంగంలో ఉన్నారో తెలుసా?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
ఆ రోజు హరికృష్ణ లేకపోతే నన్ను చంపేసే వాళ్లు అంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో అత్యంత ధనవంతుడైన జోనాస్ ఎవరు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

