భీమ్లా నాయక్ రిలీజ్‌పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్

Bheemla nayak release date | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయ్యప్పనుమ్ కోశియుమ్ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలకు ఉన్నాయని భీమ్లానాయక్ రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేయించారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు! ✨
— Sithara Entertainments (@SitharaEnts) January 15, 2022
– Team #BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/1qvzPE90YC
భీమ్లా నాయక్ నుంచి విడుదలైన తాజా పోస్టర్లో పవన్ కళ్యాణ్ గొడ్డలి పట్టుకుని సీరియస్‌గా చూస్తుండగా.. అతని వెనకాల సిగరెట్ తాగుతూ రానా స్టైల్‌గా నిలుచున్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడమే కాకుండా.. అందులో మరోసారి రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేసింది సితార ఎంటర్టైన్మెంట్స్. కరోనా కారణంగా ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాల రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భీమ్లా నాయక్ అనుకున్న సమయానికే వస్తుందని క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా విడుదలవుతుందని పోస్టర్లో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Nidhhi Agerwal | హరిహరవీరమల్లు స్టోరీ లైన్ రివీల్ చేసిన నిధి అగర్వాల్
భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..
Pawan Kalyan | ప్రస్తుతం బీజేపీతోనే పొత్తులో ఉన్నాం… టీడీపీకి ఝలక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

