భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..

Bheemla nayak | కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా కూడా హీరో ఇమేజ్ చుట్టూ కథలు తిరుగుతూ ఉంటాయి. స్టార్ హీరోలు అయితే వాళ్లకు అనుగుణంగా దర్శకులు కథలు రాస్తుంటారు. అభిమానులు ఫలానా హీరో నుంచి ఏం కోరుకుంటున్నారో అనే విషయం పూర్తిగా అర్థం చేసుకుని.. ఆ తర్వాత కథ రాస్తారు. తాజాగా విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమా ఈ కోవలోకే వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోలు కథలను కూడా డామినేట్ చేస్తూ ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు. ఈయన సినిమాలో ఉన్నాడు అంటే చాలు కథ కూడా చిన్నగా మారిపోతుంది. అంతటి స్టార్ డమ్ ఈయన సొంతం. అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే దర్శకులు కూడా కాస్త ముందు వెనుక ఆలోచిస్తారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో భీమ్లా నాయక్ ఒకటి.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లా నాయక్ తెరకెక్కుతుంది. ఒరిజినల్లో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా డామినేట్ చేస్తుంది. సినిమా టైటిల్ కూడా ఆయన క్యారెక్టర్ నేమ్ పెట్టారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఆయన పాత్ర ప్రతినాయక ఛాయలతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా కథలో మార్పులు చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
భీమ్లా నాయక్ సినిమాకు దర్శకుడు సాగర్ కే చంద్ర అయినా కూడా స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నది మాటల మాంత్రికుడు. మలయాళంలో ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు ఉండవు. కానీ తెలుగులో అవి ఎక్కువగా కనిపించబోతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్, నిత్య మీనన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా సృష్టించాడు త్రివిక్రమ్. ఇక కామెడీ ట్రాక్ కూడా భీమ్లా నాయక్ సినిమాలో కనిపించబోతుంది. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా దీని గురించి అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. మొత్తంగా తెలుగు రీమేక్‌లో ఈ మూడు మార్పులు ప్రధానంగా కనిపించబోతున్నాయి. సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
Dil Raju Naizam king | నిర్మాత దిల్ రాజు జాక్‌పాట్ కొట్టేసినట్టేనా..?
Trivikram: త్రివిక్రమ్‌పై తప్పుడు వార్తలు.. ట్వీట్‌తో వచ్చిన క్లారిటీ
Bheemla Nayak: భీమ్లా నాయక్ కన్నా ముందు చిత్ర టైటిల్ ఏమని అనుకున్నారో తెలుసా?
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
పవన్ కళ్యాణ్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

