Bheemla Nayak: భీమ్లా నాయక్ కన్నా ముందు చిత్ర టైటిల్ ఏమని అనుకున్నారో తెలుసా?

టైటిల్స్ సినిమా సక్సెస్‌లో సగ భాగం అవుతాయనే సంగతి మనందరికి తెలిసిందే. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా సినిమాలకు ముందు ఒక టైటిల్ అనుకుంటారు. తర్వాత ఆ టైటిల్‌ను మార్చేస్తుంటారు. అలాంటిదే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా టైటిల్ విషయంలోనూ జరిగిందట. ఈ చిత్రం మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ చిత్రంకు. స్క్రీన్ ప్లే, మాటలను ప్రముఖ రైటర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. అయితే సెట్స్‌లోకి వెళ్లక ముందు ఈ సినిమాకు ‘అసుర సంధ్యవేళలో..’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఆ టైటిల్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కాదేమోనని నిర్మాతలు భావించటంతో చివరకు టైటిల్‌ను ‘భీమ్లా నాయక్’గా ఖరారు చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ జోడీగా నిత్యామీనన్, రానా దగ్గుబాటి జోడీగా సంయుక్తా మీనన్ నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు, గ్లింప్స్, ప్రోమోలు విడుదలై మంచి ఆదరణను దక్కించుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

