Trivikram: త్రివిక్రమ్‌పై తప్పుడు వార్తలు.. ట్వీట్‌తో వచ్చిన క్లారిటీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా, దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు . ప్రస్తుతం ఆయన భీమ్లా నాయక్ అనే సినిమాతో పాటు మహేష్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అయతే త్రివిక్రమ్‌కి సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
సినిమా టిక్కెట్ల ధరల విషయంపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఇటీవల ఓ ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అది త్రివిక్రమే చేశారని అభిప్రాయపడిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆ ట్వీట్ గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ట్వీట్‌ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ స్పందించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసే అధికారిక ప్రకటనలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ట్విటర్ ఖాతాల ద్వారానే బయటకు వస్తాయి. ఎందుకంటే, ఆయనకు ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఖాతాల్లేవు. ఆయన పేరు, ఫొటోలతో ఉన్న ఖాతాల నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చినా దయచేసి నమ్మకండి అంటూ ఏపీ సీఎంవో, మంత్రి పేర్ని నాని ఖాతాలను నిర్మాణ సంస్థ ట్యాగ్ చేసింది.
Any official statements from #Trivikram garu will only come from @haarikahassine & @Fortune4Cinemas
— Sithara Entertainments (@SitharaEnts) November 27, 2021
He doesn't have any social media presence. Please don't believe in any comments made by various profiles bearing his pic/name.@AndhraPradeshCM @perni_nani @IPR_AP
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

