Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిమంది సెమీఫైనల్ దూసుకెళ్లగా.. వీరిలో ప్రీతి పవార్ (Preeti Pawar) ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 54 కిలోల విభాగం సెమీస్‌లో పంచ్‌లతో చెలరేగిన ప్రీతి జాంబికాకు చెందిన జ్వాపే(Zwape)ను చిత్తుగా ఓడించింది. ఇక జుడోలో ముగ్గురు ముందంజ వేశారు. మహిళల జుడో పోటీల్లో శ్రద్ధా కడుబాల్ చొపాడే, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్, రోహిత్ బషీర్‌లు క్వార్టర్ ఫైనల్ చేరారు.
గ్లాస్గో ఆతిథ్యమిస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ ప్రీతి పవార్ ఫైనల్ చేరింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన సెమీస్‌లో జ్వాపే(జాంబియా)పై పంచ్‌ల వర్షం కురిపించిందీ యువకెరటం. తొలి రౌండ్ నుంచే ప్రీతి ధాటికి ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. రెండో రౌండ్లోనూ అదే దూకుడు కొనసాగించిన భారత అమ్మాయి 5-0తో గెలుపొంది దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. దాంతో, ఆమెకు కనీసం రజతం ఖాయమైంది.
VIDEO | Glasgow, Scotland: Indian boxer Preeti Pawar in 54 kg category sailed into the Commonwealth Games final by out-punching Zambia’s Catherine Mwape in the last-four stage.
She says, “I am very happy that I have managed to do what I prepared for. I have to give my best… pic.twitter.com/O1pRkyvgF0
— Press Trust of India (@PTI_News) July 31, 2026
జుడోలో ఏకంగా ముగ్గురు భారతీయులు సత్తా చాటి క్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల విభాగంలో రోహిత్ బషీర్ పట్టుకు సామ్యూల్ రిబెరియో చేతులెత్తేశాడు. ఆర్మ్ లాక్‌తో ప్రత్యర్థి కథేవరాను పడగొట్టిన హర్ష్ సింగ్ క్వార్టర్స్ బెర్తు పట్టేశాడు. ఇక మహిళల విభాగంలో మెరిసిన శ్రద్ధా కడుబాల్ చొపాడే దూకుడు ముందు జనే మస్సాకోల్ నిలవలేకపోయింది.
Harsh Singh storms into the quarter-finals of men’s 60kg at Commonwealth Games 2026 🥋 🇮🇳
Harsh secured a dominant Ippon (100–0) victory over Chikondi Kathewera of Malawi in the Round of 16 🔥#CommonwealthGames2026 #Judo #HarshSingh pic.twitter.com/tPxTEfZCZv
— Khel Now (@KhelNow) July 31, 2026