భద్రాద్రి కొత్తగూడెం. జూలై 31 : భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టూముట్టింది. ర్యాంపు సిబ్బందితో పాటు ఇసుక లారీలు వరదలో చిక్కుకు పోయాయి. సమాచారం అందుకున్న తాసీల్దార్ మొగిలి శ్రీనివాసరావు, సీఐ రాజువర్మ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వరదలో చిక్కుకున్న 46 మందిని రక్షించారు.
గోదావరి వరదలు వీరాపురం ఇసుక ర్యాంపును చుట్టుముట్టగా వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సీఐ రాజువర్మ తెప్పపై గోదావరి
పాయను దాటుతుండగా వరద ఉదృతికి సీఐ వెళ్తున్న తెప్ప నీటిలో తిరగబడింది. తెప్ప కొంతదూరం కొట్టుకుపోయింది. సీఐ తెప్పను చాకచక్యంగా పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు.

పెరుగుతున్న గోదావరి వరద… వీరాపురం ఇసుక ర్యాంపును చుట్టుముట్టిన వరదనీరు