TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
TIMS Hospital | సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌కి దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TIMS Hospital |సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌కి దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్థానంలో మర్రి చెన్నారెడ్డి పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకుంది. కాగా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నగరం నలువైపులా ‘టిమ్స్’ పేరుతో సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే ఏడాది కాలంలోనే అన్ని దవాఖానల నిర్మాణ పనులు 60 శాతానికిపైగా పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను నిలిపివేసింది. అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాలం గడిపింది. అయితే బీఆర్ఎస్తోపాటు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో తిరిగి పనులను పట్టాలెక్కించింది. గత సంవత్సరమే మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతం సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

