‘Sardar 2’ Teaser | అభిమానులకు అప్డేట్.. కార్తీ ‘సర్దార్ 2’ టీజర్ లాంచ్‌కి టైం ఫిక్స్!
Sardar2 | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ‘సర్దార్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Sardar2 | కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ‘సర్దార్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్ కథానాయకిగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే హీరో కార్తీ తాజాగా ఒక పవర్-ప్యాక్డ్ కొత్త పోస్టర్‌ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ‘సర్దార్ 2’ సినిమా టీజర్‌ను నేడు శుక్రవారం సాయంత్రం సరిగ్గా 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. దీంతో కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కార్తీ అభిమానులు ఈ హై-వోల్టేజ్ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఈ చిత్రంలో టాలెంటెడ్ నటుడు ఎస్.జె. సూర్య పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక మొదటి భాగానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, ఈసారి కూడా తన మ్యూజిక్‌తో అదరగొట్టడానికి సిద్ధమయ్యారు. అన్ని హంగులను పూర్తి చేసుకుని ఈ సినిమాను సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నేడు రాబోతున్న టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

