Navin Kumar | ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నవీన్ కుమార్ తెలంగాణలో పర్యటించారు. సర్ (Special Intensive Revision) ప్రక్రియను సమీక్షించేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. అంతకుముందు ఆయనకు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాసం వెంకటేశ్వర రెడ్డి స్వాగతం పలికారు.
నవీన్ కుమార్ సుదర్శన్‌రెడ్డితో రాష్ట్రంలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియ పురోగతిపై చర్చించారు. అనంతరం జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎలక్షన్ ఆఫీసుకు వెళ్లి అధికారులతో మాట్లాడారు.