నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మలయాళ నటి.. అసలు నిజం ఇది..

Malayalam Actress Bhamaa | ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిందని మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. 2017లోని వేధింపుల కేసుపై తిరిగి విచారణ మొదలుపెట్టడంతో భయాందోళనకు లోనైన భామ.. ఆత్మహత్యకు యత్నించిందని వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలను చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందని ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో మలయాళ నటి భామ స్పందించింది. తనపై వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేసింది.
కొద్దిరోజులుగా నాపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అవన్నీ అవాస్తవం. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి వార్తలు నమ్మకండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. లోహితదాస్ దర్శకత్వంలో వచ్చిన నైవేద్యం సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది భామ. ఆ తర్వాత జనప్రియం, ఇవర్ వివాహతారియల్, సైకిల్, ఖలీఫత్ వంటి సినిమాల్లో నటించింది. 2018 తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన భామ.. 2020 జనవరిలో అరుణ్ అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాది పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘ఆచార్య’ విడుదల తేదీ ప్రకటన..
భీమ్లా నాయక్ రిలీజ్‌పై మరోసారి క్లారిటీ.. అదిరిపోయిన నయా పోస్టర్
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

