హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..

Krithi Shetty | ఏడాది కింద కృతి శెట్టి అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.. కానీ ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వడానికి ఒక్క సినిమా చాలు.. అలాంటి ఒక సాలిడ్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. అదే ఉప్పెన. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది బేబమ్మ. ఈ సినిమా తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే వరకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో బిజీగా ఉంది. దానికి తోడు వరుస విజయాలు కూడా ఈమె రేంజ్ పెంచేస్తున్నాయి.
ఉప్పెన తర్వాత విడుదలైన శ్యామ్ సింగరాయ్ మంచి విజయం అందుకుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి మరో హీరోయిన్. ఇందులో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ కూడా చేసింది కృతి శెట్టి. ఇక సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాలో కూడా ఈమె ఒక హీరోయిన్. నాగ చైతన్య జోడీగా ఈమె ఇందులో అల్లరి పాత్రలో ఆకట్టుకుంది. బంగార్రాజు కూడా మంచి విజయం దిశగా అడుగులు వేస్తోంది. దాంతో మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది కృతి శెట్టి.
కృతిశెట్టి గోల్డెన్ లెగ్ ఇప్పుడు మరికొందరు హీరోలకు వరంగా మారనుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ పోతినేని లింగస్వామి సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు ఫ్లాపుల్లోనే ఉన్నారు. కృతి శెట్టి అడుగుపెట్టిన తర్వాత వాళ్ల జాతకం మారుతుందేమో చూడాలి..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Krithi Shetty | పింక్ కలర్ లంగా ఓణీలో కైపెక్కిస్తున్న కృతి శెట్టి..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Krithi Shetty: చూపుతిప్పుకోలేని అందాలతో కట్టిపడేస్తున్న బేబమ్మ
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

