ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Uppena 2 | కరోనా సెకండ్ వేవ్ ముందు విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ఉప్పెన. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర నిజంగా ఉప్పెన లాంటి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో కృతి శెట్టి కుర్రాళ్ల మనసు దోచేసింది. తన తొలి సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన బుచ్చిబాబు.. సాహసోపేతమైన కథతో హిట్ కొట్టి చూపించాడు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ఏ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఉప్పెన 2 గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు బుచ్చిబాబు.

ఉప్పెన విజయం తర్వాత బుచ్చిబాబుకు చాలా అవకాశాలే వచ్చాయి. దీంతో ఈయన కొన్నేళ్ల పాటు బిజీగా ఉండటం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఉప్పెన సినిమా విడుదలై దాదాపు 8 నెలలు అవుతున్న తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించలేదు బుచ్చిబాబు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా మొదలవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కొరటాల శివకు ఓకే చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో ఇప్పుడు తారక్ బిజీ అవుతున్నాడు. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను కూడా బుచ్చిబాబే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ మోక్షజ్ఞ ఇప్పుడు అప్పుడే సినిమాల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో బుచ్చిబాబు కెరీర్ అయోమయంలో పడింది. ఇలాంటి సమయంలో వైష్ణవ్ తేజ్తో బుచ్చిబాబు ఉప్పెన 2 సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఉప్పెన కంటే కూడా ఉప్పెన 2 కథనే ముందుగా రాసుకున్నట్లు చెప్పాడు. ఉప్పెన 2 ప్రపంచంలోనే ఎవరూ రాయని ఒక స్టోరీ అవుతుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఉప్పెనతోనే వినూత్న ప్రయోగం చేసిన బుచ్చిబాబు.. ఉప్పెన 2లో ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఉప్పెన బ్లాక్బస్టర్ తర్వాత కూడా.. ఖాళీగానే ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు
buchi babu | ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
vaishnav tej | 100 కోట్ల హీరో.. 10 కోట్లు కూడా తెచ్చేలా లేడుగా..
Uppena | ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కాదట..!
Krithi Shetty : ఉప్పెన బ్యూటీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. వైరల్గా మారిన పిక్స్
Krithi Shetty : అమ్మాయి గురించి చెప్పాలంటే..
Krithi Shetty: బేబమ్మతో సినిమా చేయనంటున్న విజయ్ సేతుపతి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

