Krithi Shetty: బేబమ్మతో సినిమా చేయనంటున్న విజయ్ సేతుపతి..!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి మొన్నటి వరకు తమిళ ప్రేక్షకులని మాత్రమే అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
అయితే విజయ్ సేతుపతి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారట. ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని ఆమెని రిజెక్ట్ చేశానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. సినిమా యూనిట్ సభ్యులకు నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విషయం తెలియదు. అందుకే ఆమెను నా సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కాని నేను చేయను అని చెప్పేశా.
నాకు కృతి వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. అందుకే ఆమెతో కలిసి నటించలేను అని టీమ్ కు చెప్పాను అన్నాడు విజయ్. కూతురిలా భావించిన అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తాను చెప్పండి అంటూ యూనిట్ సభ్యులకు చెప్పాడట. ఎప్పటికీ తనతో హీరోయిన్గా చేయనని విజయ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన లాభం సినిమా చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు.
దంగల్ లో కూతురుగా నటించిన హీరోయిన్ తో ఆ వెంటనే అమీర్ ఖాన్ రొమాన్స్ చేసిన విషయం తెల్సిందే. గతంలో పలువురు హీరోలు కూడా అలానే చేశారు.కాని విజయ్ సేతుపతి మాత్రం అందుకు నో చెబుతుండడం గొప్ప విషయం అనే చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

