100 కోట్ల హీరో.. 10 కోట్లు కూడా తెచ్చేలా లేడుగా..

Konda polam | ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.. మళ్లీ వెంటనే మరో సినిమా ఊహించిన విధంగా ఫ్లాప్ అవుతుంది. ఒక సినిమా 100 కోట్లు వసూలు చేసింది కదా అని తర్వాత సినిమా కూడా అదే స్థాయిలో వసూలు చేస్తుందేమో అనుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ( vaishnav tej ) విషయంలో ఇదే జరుగుతుంది. ఉప్పెన సినిమాతో సంచలన విజయం అందుకొన్నాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించాడు. ఈ కుర్రాడి దూకుడు చూసి ట్రేడ్ పండితులు కూడా పరేషాన్ అయ్యారు. కానీ ఇప్పుడు రెండో సినిమా కొండ పొలం మాత్రం కలెక్షన్లను రాబట్టడంలో తడబడుతూ ఉంది.

వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకు కలెక్షన్ల ఉప్పెన కురిసింది. అయితే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఉప్పెన సినిమా విడుదలయ్యే సమయానికి కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయింది. దానికి తోడు చాలా రోజుల నుంచి మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో విడుదలైన ఉప్పెన మొదటి రోజు నుంచి దూకుడు చూపించింది. పైగా ఆ టైంకు ఇతర సినిమాలు లేకపోవడం.. దానికి పాజిటివ్ టాక్ రావడం.. ఇలా చాలా కారణాలతో ఉప్పెన 50 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పుడు తాజాగా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం విడుదలైంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. క్రిష్ ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించారు. బిజినెస్ కూడా అలాగే చేశారు. 9 కోట్లు వసూలు చేస్తే కొండ పొలం సినిమా సేఫ్ జోన్‌కు వస్తుంది.. కానీ ఈ సినిమా అది కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. ఐదు రోజుల్లో ఇప్పటి వరకు ఈ సినిమా 4 కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మహా అయితే మరో కోటి రూపాయలు రావడం కూడా గగనమే. మొత్తానికి మొదటి సినిమాతో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాతో 10 కోట్లు కూడా తీసుకురాలేకపోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Konda Polam Collections | ‘కొండపొలం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..‘ఉప్పెన’తో పోలిస్తే..
Konda polam | కొండ పొలం అలరించిందా.. ప్రేక్షకులు ఏమంటున్నారు..?
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?
Konda Polam : బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన కొండ పొలం టీం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

