Konda Polam: బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన కొండ పొలం టీం

ప్రస్తుతం బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్ 5 జరుపుకుంటుండగా, ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో నుండి నలుగురు సభ్యులు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు హౌజ్‌లో 16 మంది ఉన్నారు. అయితే ఈ షోని పలు సినిమాల ప్రమోషన్స్ కోసం కూడా వాడుకుంటున్నారు.
తాజాగా బిగ్ బాస్ వేదికపై కొండ పొలం టీం సందడి చేసింది. హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు క్రిష్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ వేదికపై నాగ్‌తో కలిసి సందడి చేశారు. వైష్ణవ్ ఇంత చిన్న వయస్సులోనే రకుల్‌ని ప్రేమించావా అంటూ నాగార్జున అడగగా, అందుకు వైష్ణవ్ చేయాల్సి వచ్చిందని బదులు ఇచ్చాడు. మీరు 45 రోజులు అడవుల్లో ఉంటే మా వాళ్లు 105 రోజులు ఇక్కడ ఉంటున్నారు అని నాగ్ అన్నాడు.చూస్తుంటే షో సందడిగా సాగినట్టు అర్ధమవుతుంది.
కొండ పొలం చిత్రాన్ని అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచర్స్ చిత్రంగా రూపొందించారు. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగా, గొర్రెలు కాచుకొనే ‘ఓబులమ్మ’గా, వైష్ణవ్ తేజ్ ‘కటారు రవీంద్ర’ అనే పాత్రలో కనిపించి అలరించారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

