Konda polam | కొండ పొలం అలరించిందా.. ప్రేక్షకులు ఏమంటున్నారు..?

Konda polam | కమర్షియల్ సినిమాలు చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ నవలలను సినిమాలుగా తెరకెక్కించే బాధ్యత చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. పుస్తకాల్లో ఉన్న కథలకు తెర రూపం ఇవ్వాలి అంటే చాలా కష్టం. అది అనుకున్నంత ఈజీ కాదు. కథ చదివేటప్పుడు పుస్తకాల్లో బాగానే ఉంటుంది కానీ విజువలైజేషన్ మాత్రం ఊహించనంత సింపుల్‌గా ఉండదు. అందుకే ఒకప్పుడు నవలలు సినిమాలుగా ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు అలా రావడం లేదు. కొన్నేళ్లుగా పుస్తకాలను సినిమాలలో చూడటం అరుదుగా జరుగుతుంది. ఇలాంటి ఈ సమయంలో ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి దానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆ సినిమానే కొండ పొలం.

చాలా తక్కువ బడ్జెట్లో కేవలం 40 రోజుల పని దినాల్లో నల్లమల అడవి చుట్టూ కొండ పొలం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. తాజాగా విడుదలైన కొండ పొలం సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.. కానీ కమర్షియల్ అంశాలు మాత్రం సినిమాలో కనిపించడం లేదని అంటున్నారు. పుస్తకం చదువుతున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది.. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం అంతగా అనిపించలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాగా చూసుకుంటే కొండ పొలం అంచనాలు అందుకోలేదు అనడంలో ఎలాంటి దాపరికం లేదు. కానీ నవలా రూపంలో మాత్రం ఇది ఒక అద్భుతం. దాన్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు క్రిష్. నటుడిగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్ నటన కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. అయితే ఎన్ని ఉన్నా కూడా స్లో నెరేషన్ ఈ సినిమాకు మైనస్‌గా మారింది. తొలిరోజు ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసిన తర్వాత కమర్షియల్‌గా విజయం సాధించడం కష్టమే. అవార్డులు మాత్రం కచ్చితంగా అందుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Naga Babu: ఎన్నికల సిత్రం.. ప్రకాశ్ రాజ్‌ని విమర్శించిన ట్వీట్స్ తొలగించిన నాగబాబు
Samantha: సమంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?
క్రేజీ అనౌన్స్మెంట్ అంటూ సస్పెన్స్‌లో పెట్టిన కాజల్ అగర్వాల్
ప్రియకు బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్..సద్వినియోగం చేసుకుందా?
వైష్ణవ్ తేజ్ రకుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

