నాగ చైతన్యను 2017లో వివాహం చేసుకున్న సమంత రీసెంట్గా అతడికి డైవర్స్ ఇచ్చింది. పదేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యానికి పులిస్టాప్ పెట్టింది. విడాకుల ప్రకటన తర్వాత సమంత నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఆమె ఒంటిపై వేయించుకున్న టాటూల విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. సమంత తన శరీరంపై మూడు టాటూలను వేసుకుంది. ఇవన్నీ ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు అంకితమిచ్చినవి కావడం విశేషం.
సమంత వీపు పై భాగంలో వైఎంసీ అనే టాటూ ఉంటుంది.ఇది ఏ మాయ చేసావే సినిమాకు గుర్తుగా వేయించుకుంది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య బాండింగ్ బలపడిందని అంటారు. ఇక రెండో టాటూ చైతూ సంతకం అని అంటారు. తన భర్తపై ప్రేమతో అతడి సంతకాన్ని ఆమె నడుముకు పైభాగంలో వేయించుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక సమంత – నాగ చైతన్య ఇద్దరూ తమ ముంజేతులపై రెండు బాణాలతో ఉన్నటాటూ వేయించుకున్నారు. ఈ పచ్చబొట్టు అర్థం మీ స్వంత వాస్తవికతను సృష్టించడం. మూడు టాటూలు కూడా చైతూకి సంబంధించినవి కాగా, ఇప్పుడు అతనితో తెగదెంపులు చేసుకున్న సమంత వాటిని ఉంచుకుంటుందా,చెరిపేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.