KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
KTR | స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ (RUTUR)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రారంభించారు.
KTR | హైదరాబాద్: స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ (RUTUR)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రారంభించారు. వరంగల్ కేంద్రంగా రూపుదిద్దుకున్న ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయాణికులకు అందుబాటు ధరల్లో రవాణా సేవలు అందించడంతో పాటు డ్రైవర్లకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
నమ్మకమైన రైడ్ సేవలు, వినూత్న సాంకేతికతతో ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే రుటూర్ ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయని విధానంతో వారి ఆదాయాన్ని మెరుగుపరచడంతో పాటు, ప్రయాణికులకు సరసమైన ధరల్లో సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
అశోక్ స్థాపించిన రుటూర్ సంస్థలో నిఖిల్ సీఈఓగా, క్రాంతి సీఓఓగా, అక్షయ్ సీఎఫ్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాంకేతికత, ఆవిష్కరణలను ఉపయోగించుకుంటూ నిత్య ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపడంతో పాటు, మొబిలిటీ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.
ఈ సందర్భంగా రుటూర్ వ్యవస్థాపకులు, బృందానికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మొబిలిటీ రంగంలో సరికొత్త మార్పులకు ఈ ప్లాట్ఫామ్ శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థకు రుటూర్ మరింతగా తోడ్పడాలని పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణలు ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

