హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 16:దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలతో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
గౌరీపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ సెక్రటరీ అద్వైత్ కుమార్ సింగ్, ఐఏఎస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో భాగస్వాములయ్యారు.

Delhi Bathukamma2
ఈ సందర్భంగా అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, ప్రకృతి పట్ల ప్రజలకు ఉన్న ప్రేమకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అందరూ ఒకచోట చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆనందాన్ని పంచుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ ఇలాంటి వేడుకలు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
బతుకమ్మ కోసం పూలను సేకరించడం నుంచి వాటిని అందంగా పేర్చడం వరకు మహిళలు ఎంతో శ్రద్ధ తీసుకుంటారని ఆయన అన్నారు. తమ ఆటపాటలతో వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చే మహిళలను అభినందించారు. పిల్లలకు తెలంగాణ పండుగలు, పాటలు, ఆచారాలను పరిచయం చేయడం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు.
మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది కూడా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

