Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
Bathukamma Celebrations | రంగురంగుల పూల బతుకమ్మలు.. కళాకారుల జానపద గీతాలు.. మహిళలు, పురుషుల ఉత్సాహభరిత నృత్యాలతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎతుబార్పల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
Bathukamma Celebrations | మొయినాబాద్, అక్టోబర్ 16: రంగురంగుల పూల బతుకమ్మలు.. కళాకారుల జానపద గీతాలు.. మహిళలు, పురుషుల ఉత్సాహభరిత నృత్యాలతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎతుబార్పల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రాత్రి గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. అనంతరం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా కొనసాగాయి. బతుకమ్మ వేడుకల్లో మహిళలంతా ఒకే రకమైన చీరల్లో కనిపించాలనే ఉద్దేశంతో గ్రామంలోని మహిళలకు సర్పంచ్ చింతకింది ప్రవీణ్ రెడ్డి ఆకుపచ్చ రంగు చీరలను పంపిణీ చేశారు. మహిళలు ఆ చీరలను ధరించి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కళాకారిణి నిర్మలా రాథోడ్ బృందం ఆలపించిన బతుకమ్మ, జానపద పాటలు వేడుకల్లో ఉత్సాహాన్ని నింపాయి. కళాకారుల పాటలకు అనుగుణంగా మహిళలు, పురుషులు కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామ ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉత్సవ ప్రాంగణం కోలాహలంగా మారింది. రాత్రి 10 గంటల వరకు వరకు వేడుకలు కొనసాగాయి. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటపాటలతో ఎతుబార్పల్లిలో పండుగ శోభ వెల్లివిరిసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
Horoscope | 20-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
Revanth Reddy | ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్‌బాల్..తనను కోసినా రూపాయిలేదన్న సీఎం వ్యాఖ్యలపై సెటైర్లు
Revanth Reddy | సీఎం సభ అట్టర్‌ఫ్లాప్.. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెళ్లిపోయిన జనం
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ వర్సెస్ రాజగోపాల్.. రెండు రోజులుగా సీఎంను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

