Summer Movies | సినిమాల్లోనే కాదు.. బయట కూడా చాలా ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తాయని కలలు కన్న సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఒక్క బంగార్రాజు మాత్రమే వచ్చి థియేటర్లలో పండగ చేసుకుంటున్నాడు. సంక్రాంతికి కొన్ని పెద్ద సినిమాలు వస్తే సమ్మర్లో మిగిలినవి వస్తాయని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు అన్ని పాడైపోయాయి. ఒక్క సినిమా కూడా సంక్రాంతికి రాలేదు. దాంతో పెద్ద సినిమాలన్నీ సమ్మర్ టార్గెట్ చేస్తున్నాయి. ఎవరు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియడం లేదు. అందుకే మూడు నెలల ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. కానీ ముందు నుంచి సమ్మర్ కర్చీఫ్ వేసుకున్న సినిమాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదల కానుంది. ఈ విషయం దాదాపు ఏడు నెలల కింద కన్ఫార్మ్ చేశారు దర్శక నిర్మాతలు. మరోవైపు ఏప్రిల్లోనే మరి కొన్ని పెద్ద సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సర్కారు వారి పాట ఏప్రిల్ 1 న రానున్నట్లు రెండు నెలల కింద పోస్టర్ విడుదల చేశారు. అయితే ఊహించని విధంగా ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దాంతో ఇప్పుడు ఈ సినిమాలు కూడా సమ్మర్ లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 1 పోస్ట్ పోన్ అయ్యింది. ఇది ఒకటి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా వచ్చే వరకు అనుమానమే. ఈ సినిమాలన్నీ వాయిదా పడితే మళ్లీ కలగాపులగం అవుతుంది. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఎన్ని రోజుల గ్యాప్లో వస్తుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
నిర్మాతలు కూడా దీన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నారు. కరోనా వైరస్ కారణంగా వచ్చిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వాళ్లకు అర్థం కావడం లేదు. పెద్ద సినిమాలన్నీ ఒకేసారి వస్తే కచ్చితంగా అందరికీ కోట్ల రూపాయల నష్టం తప్పదు. ఈ విషయం తెలిసినా కూడా వాళ్లేమీ చేయలేని పొజిషన్లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆచార్య, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ట్రిపుల్ ఆర్, కేజిఎఫ్ 2, రాధే శ్యామ్ తదితర సినిమాలన్నీ ఒకే సీజన్లో విడుదల కానున్నాయి. వీటికి సరైన విడుదల తేదీ దొరక్క పోతే నష్టం మామూలుగా ఉండదు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Radhe shyam | ప్రభాస్ రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
మెగా అభిమానులకు గుడ్న్యూస్.. ‘ఆచార్య’ విడుదల తేదీ ప్రకటన..