అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Arundhati Movie | సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క.. విక్రమార్కుడు సినిమాతో మొదటి విజయం అందుకొంది. అయితే అప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్గా ఉన్న ఈమె.. ఒక్కసారిగా లేడీ సూపర్ స్టార్ అయిపోయేలా హెల్ప్ చేసిన సినిమా అరుంధతి. 2009 జనవరి 16న విడుదలైన ఈ సినిమాకు దివంగత కోడి రామకృష్ణ దర్శకుడు. అప్పటి వరకు అందాల ఆరబోతతో గ్లామర్ హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుష్క.. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పిన కథ నచ్చి.. ఆయన విజన్ కు మెచ్చి అరుంధతి సినిమాకు సైన్ చేసింది.
అరుంధతి సినిమాకు ముందు కోడి రామకృష్ణ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. మరోవైపు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కొన్నేళ్లుగా డౌన్ ఫాల్ చూస్తున్నాడు. అలాంటి సమయంలో భారీ విజువల్ వండర్‌కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా అరుంధతి మొదలైంది. ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. స్టార్ హీరోల సినిమాలకు కూడా సాధ్యం కాని రీతిలో అరుంధతి సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. 13 ఏళ్ల కింద ఏకంగా రూ.35 కోట్ల షేర్ వసూలు చేసి అప్పటి టాలీవుడ్ టాప్ 5 సినిమాల్లో చోటు సంపాదించింది. పండక్కి అనుష్కతో పోటీ పడిన రామ్ పోతినేని మస్కా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
అయితే అనుష్క కంటే ముందు అరుంధతి సినిమా కథను మలయాళ నటి మమతా మోహన్‌దాస్‌కు, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి చెప్పారు. అయితే అనివార్య కారణాలతో వాళ్లు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అదే అనుష్క కెరీర్‌కు వరంగా మారింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన అరుంధతి ఒకసారి థియేటర్లోకి వచ్చాక.. 100 రోజుల పాటు సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో అనుష్కతో పాటు అఘోరగా నటించిన సోనూసూద్ కూడా స్టార్ అయిపోయాడు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ ఒక్క సినిమాతో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కష్టాలు అన్ని తీరిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన మలయాళ నటి.. అసలు నిజం ఇది..
Covid-19 | మలయాళీ సూపర్‌స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్
టాక్ బాగున్నా.. కలెక్షన్స్ లేవు.. అయ్యో పాపం ‘హీరో’..
మెగా అల్లుడిని కనీసం పట్టించుకోవడం లేదుగా.. సూపర్ మచ్చికి డెఫిషీట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

