ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 06:51:27

అజిత్ ముద్దుల త‌న‌యుడు పిక్స్ వైర‌ల్

అజిత్ ముద్దుల త‌న‌యుడు పిక్స్ వైర‌ల్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఆయ‌న ఫ్యామిలీ పెద్ద‌గా లైమ్ లైటోకి రాదు. దీంతో అజిత్ పిల్లలు ఎలా ఉంటారో కూడా అభిమానుల‌కు పెద్ద‌గా తెలియ‌దు. అయితే  చెన్నైలో జరిగిన సన్నిహితుల వివాహానికి అజిత్ భార్య  షాలిని తన చెల్లెలు షామిలీ, కొడుకు ఆద్విక్ తో కలిసి హాజరయ్యారు. ఆ వేడుక‌లో అయాక‌పు చూపులు చూస్తూ బోసి న‌వ్వులు న‌వ్వుతున్న ఆద్విక్ అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. ఆద్విక్ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 

అజిత్‌-షాలినీ దంపతులకు కూతురు అనౌష్క, కొడుకు ఆద్విక్‌ ఉన్నారు. 2015 మార్చి 2న ఆద్విక్ జ‌న్మించ‌గా,  2008లో అనౌష్క పుట్టింది. అభిమానులు ఆద్విక్‌ను కుట్టీ త‌ల అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక అజిత్ సినిమాల విష‌యానికి వ‌స్తే  విశ్వాసం, నెర్కొండ పార్వై  సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన అజిత్ ప్ర‌స్తుతం వాలిమై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


VIDEOS

logo