12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య | ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది.

ముంబై : ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. సదరు మహిళను చండివాలి నహారే అమృత్ శక్తి నివాస్‌కు చెందిన రేష్మ ట్రెంచిల్గా గుర్తించారు. ఆమె భర్త శరత్ మే 23న కరోనా బారినపడి మృతి చెందారు. అతను ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పని చేశారు. రేష్మ వద్ద సూసైడ్ నోట్ ఆధారంగా పొరుగింటి వారిపై సకినాకా పోలీస్‌స్టేషన్‌లో సుమోటో కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఆమె భర్తతో కలిసి ఏప్రిల్ 10న కొత్త అద్దె అపార్ట్మెంట్లోకి మారారు. అప్పటి నుంచి పొరింటి వారితో గొడవలు మొదలయ్యాయి.
రేష్మ కొడుకు ఆడుకుంటున్న సమయంలో ఎక్కువ శబ్దాలు చేయడంతో పొరుగున ఉంటున్న కుటుంబం సొసైటీకి ఫిర్యాదు చేశారు. అనంతరం రేష్మ భర్త శరత్ యూపీలోని వారణాసికి వెళ్లి కరోనా బారినపడిన తన తల్లిదండ్రులకు సేవలందించాడు. ఆ తర్వాత శరత్ కరోనా బారినపడి మరణించాడు. ఈ క్రమంలోనే రేష్మ తనయుడు గరుడ్ ఆడుకుంటున్న సమయంలో చప్పుడు చేస్తున్నారంటూ మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే, మేలో రెండు కుటుంబాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు పిలిచామని, బాధితురాలు రేష్మా పొరుగు వారిపై మానసిక వేధింపుల ఆరోపణలు చేసిందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితురాలి కొడుకుపై కుటుంబం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
నేడు కేంద్ర కేబినెట్ భేటీ!
కరోనా టీకా డ్రైవ్‌లో మరో మైలురాయి దాటిన భారత్
మిక్సింగ్ టీకాలు తీసుకున్న ఇటలీ ప్రధాని
డివైడర్‌ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

