టాలీవుడ్ యువ హీరో ఆదిసాయికుమార్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కిరాతక. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎం వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను డైరెక్టర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 13 నుంచి కిరాతక సెట్స్ పైకి వెళ్తుందని డైరెక్టర్ వీరభద్రమ్ తెలియజేస్తూ..ఆది క్రైం సీన్ లో ఉన్న మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు.
లాక్ డౌన్ సమయంలో విన్న అన్ని స్క్రిప్టుల్లో వీరభద్రమ్ చెప్పిన కథ నచ్చిందని, క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో నటనకు ఎక్కువగా ఆస్కారముంటుందని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని, ఈ మూవీతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంటామని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజన్ సినిమాస్ బ్యానర్ పై డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. దేవ్‌గిల్, దాసరి అరుణ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్.
Spine Chilling Thriller #Kirathaka 💥 Shooting Starts From Aug 13th📽️
— veerabhadram mullapudi (@veerabhadramdir) July 29, 2021
Can't wait to get on the sets with #AadiSaiKumar & @starlingpayal@shamna_kkasim #DasariArunKumar #DevGill
Produced by @NagamTirupathi #VisionCinemaas@ThirmalYalla @sureshbobbili9 @RaamDop @MittapalliSuri pic.twitter.com/AH2s99ULpM
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..