Gold Purity | ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో తప్పనిసరి బంగారం కొనుగోలు చేయాల్సిందే. జువెల్లరీ (ఆభరణాలు) రూపంలో గానీ, ఇన్వెస్ట్మెంట్ రూపంలో గానీ ప్రతి ఒక్కరూ కొనక తప్పదు. బంగారం అంటే మనీ.. బంగారంపై ఏ రూపంలో పెట్టుబడి పెట్టినా మంచి ఇన్వెస్ట్‌మెంటే. మీరు ఆభరణాల దుకాణానికి వెళ్లినప్పుడు సదరు ఆభరణాల వ్యాపారి మీకు రెండు ఆప్షన్లు ఇస్తారు. 22 కే, 24 కే ల్లో దేనికి ప్రాధాన్యం ఇస్తారో తెలుసుకోండని సూచిస్తారు. కే అంటే క్యారట్.. బంగారం స్వచ్ఛత (ప్యూరిటీ)ను క్యారట్లలో గుర్తిస్తారు. ఎక్కువ క్యారట్లలో బంగారం ఉంటే దాని స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది. 24 క్యారట్ల బంగారం అంటే అత్యంత స్వచ్ఛత గల బంగారం లభిస్తుంది. 22 క్యారట్లు, 24 క్యారట్ల బంగారం స్వచ్ఛతలో చాలా తేడాలు ఉన్నాయి.
24 క్యారట్ల బంగారం అంటే 99.9 ప్యూరిటీ ఉంటుంది. వాటిల్లో ఇతర లోహాలకు చోటు ఉండదు. 24 క్యారట్ల బంగారం కంటే ప్యూరిటీ గల గోల్డ్ ఉండనే ఉందు. భారత్‌లో 24కే బంగారం ధర రోజురోజుకూ మారుతూ ఉంటుంది. 22 కే, 18కే గోల్డ్ కంటే అత్యంత విలువైందీ 24 కే బంగారం. ఇది ఫైనాన్సియల్ అవసరాలకు సూటబుల్.. తర్వాత సాఫ్ట్‌గా మారుతుంది కనుక జ్యువెల్లరీగా పనికి రాదు.
22 క్యారట్ల బంగారం అంటే తులం బంగారంలో 22 క్యారట్ల స్వచ్చత ఉంటుంది. మిగతా రెండు క్యారట్ల స్థానంలో జింక్, రాగి తదితర లోహాలు మిక్స్ చేస్తారు. ఇది 24 క్యారట్ల బంగారం కంటే టఫ్. జ్యువెల్లరీ తయారీకి ఇది సూటబుల్. ఇందులో 91.67 శాతం ప్యూరిటీ ఉంటుంది. అందుకే దీన్ని 916 గోల్డ్ అని అంతా పిలుస్తుంటారు.
ఇన్వెస్ట్మెంట్ కోసమైతే 24 క్యారట్ల బంగారం ఐడియల్ చాయిస్. ఎందుకంటే 24 క్యారట్ల బంగారం అంటే పూర్తి స్వచ్ఛతతో కూడుకుని ఉంటుంది. ఈ క్యాటగిరీలో 24కే గోల్డ్ కాయిన్ లేదా బార్ కొనుగోలు చేయడం బెటర్ అనే అభిప్రాయం ఉంది. మీరు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం కాకుంటే 24 క్యారట్ల బంగారం కొనుగోలు చేయడం ఏ విధంగానూ రైట్ చాయిస్ కాదని నిపుణులు అంటున్నారు.
ప్రతి రోజూ ధరించే ఆభరణాలంటే 22 క్యారట్ల బంగారం కొనుక్కోవడం బెస్టంటున్నారు బులియన్ నిపుణులు. జ్యువెల్లరీ వ్యాపారులు.. ఆభరణాలు డిజైన్ చేసి తయారు చేయడానికి 22 క్యారట్ల బంగారం అనువుగా ఉంటుంది. మిగతా రెండు క్యారెట్ల ఇతర లోహాలతో 22 క్యారట్ల బంగారం కలిపితే ఆభరణాలు తయారు చేయడానికి సూటబుల్‌గా ఉంటుంది. క్యారట్లను బట్టి బంగారం స్వచ్ఛత ఉంటుంది. మీరు 14 కే గోల్డ్ రింగ్ కొన్నారనుకోండి. దాన్ని 24తో బాగిస్తే 0.583కి సమానం అవుతుంది. అంటే 14కే గోల్డ్ రింగ్‌లో బంగారం కంటెంట్ 58.3 శాతం ఉంటుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే బంగారంలోని క్యారట్లను బట్టి దాని స్వచ్ఛతకు గ్యారంటీ లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?
Omicron | ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా..
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?