e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News బంగారంపై భార‌త్‌లో మోజు త‌గ్గుతుందా..!?

బంగారంపై భార‌త్‌లో మోజు త‌గ్గుతుందా..!?

బంగారంపై భార‌త్‌లో మోజు త‌గ్గుతుందా..!?

న్యూఢిల్లీ: ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి ప్ర‌జ‌లు.. ప్ర‌త్యేకించి ఇండియ‌న్ల మ‌నో భావాల్లో స‌మూల మార్పులు తీసుకొస్తున్న‌ది. ఇంత‌కుముందు బంగారం కొనుగోళ్ల‌కు మొగ్గు చూపే భార‌తీయులు, ఇండియ‌న్ ఇన్వెస్ట‌ర్లు తొలి వేవ్ వేళ‌.. విశాల‌మైన ఇండ్ల కొనుగోలుకు ఆస‌క్తి చూపుతున్నారు.

బంగారం కొనుగోలు చేసే భార‌తీయుల్లో ప్రాధాన్య‌త‌లు మారుతున్నాయి. సంప్ర‌దాయ దుకాణాల‌కు వెళ్ల‌డానికి బ‌దులు మోడ్ర‌న్‌, రిటైల్ షాపుల‌కు వెళ్ల‌డానికి మొగ్గు చూపుతున్నారు.

ప్ర‌పంచంలోకెల్లా బంగారం కొనుగోలు చేయ‌డంలో భార‌త్‌ది మొద‌టిస్థానం. కానీ ఇప్పుడు వేల భార‌తీయ కుటుంబాలు.. చిన్న‌ జ్యువెల్ల‌రీ దుకాణాల‌కు వెళ్ల‌డం మానుకున్నార‌ని క‌ల్యాణ్ జ్యువెల్ల‌ర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ర‌మేశ్ క‌ల్యాణ రామ‌న్ చెప్పారు.

మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపుతున్న వేళ‌.. ఖ‌ర్చులు ఆచితూచి పెడుతున్న భార‌తీయుల్లో గ‌త త్రైమాసికంలో చాలా చాలా మార్పు వ‌చ్చింద‌న్నారు ర‌మేశ్ క‌ల్యాణ రామ‌న్‌. గ‌తేడాదితో పోలిస్తే 50 శాతానికి పైగా ఫ‌స్ట్‌టైం క‌స్ట‌మ‌ర్లు దుకాణాల‌కు రావ‌డాన్ని గ‌మ‌నించామ‌న్నారు.

ప్ర‌జ‌లు ర‌ద్దీ వీధుల్లోకి, చిన్న వ్యాపార దుకాణ‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధంగా లేరు.. అతిపెద్ద దుకాణాల‌కు వెళ్ల‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

బంగారానికి డిమాండ్ గ‌తేడాది రెండు ద‌శాబ్దాల క్రితం స్థాయికి ప‌డిపోయింది. ఆర్థిక కార్య‌క‌లాపాలు గాడిన ప‌డ‌టంతో బంగారం కొనుగోళ్లు ఈ ఏడాది తొలి మూడు నెల‌ల్లో మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరుకున్నాయి.

క‌స్ట‌మ‌ర్లు బంగారం కొనుగోళ్లు చేయ‌డంలో నాణ్య‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో చిన్న వ్యాపార సంస్థ‌లు త‌మ ఖాతాదారుల‌ను కాపాడుకోవ‌డానికి బంగారం త‌యారీలో నాణ్య‌త‌కు పెద్ద పీట వేస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి:

అక్కెర‌కురాని ముచ్చ‌ట్ల‌తో లాభం లేదు.. ప్ర‌ధాని మ‌న్ కీ బాత్‌పై రాహుల్‌గాంధీ ఫైర్

ప్రియుడితో క‌లిసి సొంతింట్లోనే యువ‌తి దొంగ‌త‌నం

ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…

IPL 2021: ఐపీఎల్‌ కోసం సీపీఎల్‌ షెడ్యూల్‌ మార్పు

మార్స్‌పై మేఘాల‌ను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుత‌మైన ఫొటోలు

బుల్లెట్ బైక్‌ కోసం వ‌రుడి డిమాండ్‌.. ఊహించ‌ని షాక్ ఇచ్చిన వ‌ధువు

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తా.. పార్టీని గాడిలో పెడ‌తా!

ప్రియుడితో క‌లిసి సొంతింట్లోనే యువ‌తి దొంగ‌త‌నం

బుల్లెట్ బైక్‌ కోసం వ‌రుడి డిమాండ్‌.. ఊహించ‌ని షాక్ ఇచ్చిన వ‌ధువు

పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృత‌దేహాన్ని న‌దిలో ప‌డేస్తూ.. షాకింగ్ వీడియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగారంపై భార‌త్‌లో మోజు త‌గ్గుతుందా..!?

ట్రెండింగ్‌

Advertisement