పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో

బల్రామ్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తి కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గంగ, యమున నదుల్లో వందల సంఖ్యలో శవాలు తేలుతూ కనిపిస్తున్న తరుణంలో ఈ వీడియో షాక్‌కు గురి చేస్తోంది.
పట్టపగలు, బ్రిడ్డిపై వాహనాలు తిరుగుతున్న సమయంలోనే ఆ వ్యక్తి మరొకరి సాయంతో ఇలా మృతదేహాన్ని నదిలోకి పడేయడం గమనార్హం. ఈ నెల 28న జరిగిన ఈ ఘటనను ఆ సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. అది కొవిడ్ పేషెంట్ మృతదేహమేనని బల్రామ్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీబీ సింగ్ చెప్పారు. ఇప్పటికే బంధువులపై కేసు నమోదు చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
#India | A man in a PPE suit was caught on camera throwing a body into Rapti river in #UttarPradesh.
— Munir A Hussein (@Munir566) May 30, 2021
The body was of a Covid positive patient who lost his life on May 28. pic.twitter.com/P49GzBZv5j
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

