జీసీసీ హబ్‌గా హైదరాబాద్
ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ హబ్‌గా మారుతున్నది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భాగ్యనగరమే అడ్డాగా నిలుస్తున్నది.
- ఆఫీస్ స్పేస్ లీజ్ వృద్ధిలో మనమే టాప్
- నిరుటితో పోలిస్తే 261 శాతం వృద్ధి
- దేశ, విదేశీ కంపెనీలకు అనుకూలంగా మారిన భాగ్యనగరం: నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ హబ్‌గా మారుతున్నది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భాగ్యనగరమే అడ్డాగా నిలుస్తున్నది. తమ కార్యకలాపాలను విస్తరించేందుకు, ప్రపంచ స్థాయిలో కొత్తగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నాయి. ఇందుకోసం పెద్దమొత్తంలో ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకుంటున్నాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త జీసీసీలు తీసుకున్న ఆఫీస్ స్పేస్‌లో సింహభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ నెల మొదటి వారంలో వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలోనే హైదరాబాద్‌లో జీసీసీల కోసం ఎక్కువ ఆఫీసు స్పేస్‌ను ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు లీజుకు తీసుకున్నాయని పేర్కొన్నది.
2024 జనవరి-మార్చి త్రైమాసికంలో 2 మిలియన్లు (సుమారు 20 లక్షల చదరపు అడుగులు) హైదరాబాద్‌లో కంపెనీలు లీజుకు తీసుకున్నాయని, ఇతర నగరాలతో పోల్చితే 39 శాతం అధికమని నివేదికలో వెల్లడించింది. 2023 మొదటి త్రైమాసికం (క్యూ1-2023)లో 0.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకోగా, తాజాగా 2024 క్యూ1లో అది 3.0 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. జీసీసీలకు హబ్‌గా మారేందుకు దేశంలోనే హైదరాబాద్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇతర దేశాలు, నగరాలతో పోల్చితే హైదరాబాద్ కేంద్రంగా జీసీసీలను ఏర్పాటు చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

