Tariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం (Tariff War) కొనసాగుతోంది. డ్రాగన్‌పై అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా చైనాపై మరో 20 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీంతో ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకం 145 శాతానికి చేరుకుంది.
కాగా, బుధవారానికి 125 శాతమని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనగా.. గురువారం నాటికి అవి 145 శాతానికి పెరిగినట్లు శ్వేతసౌధం తాజాగా ప్రకటించింది. ఫెంటానిల్ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణలకుగాను ప్రత్యేకంగా 20 శాతం సుంకాలు విధించినట్లు పేర్కొంది. ఫలితంగా 125 శాతంగా ఉన్న టారిఫ్‌లు కాస్తా 145కు పెరిగినట్లు వెల్లడించింది. ఇక అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌పై విధించిన 26శాతం అదనపు సుంకాల మినహాయింపు జులై 9వ వరకూ అమల్లో ఉంటుందని వైట్‌హౌస్ ఈ సందర్భంగా పేర్కొంది.
గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది (China tariffs). దీనిపై ఆగ్రహించిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి.
అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్ బుధవారం మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది. టక ఫెంటానిల్ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణలకుగాను ప్రత్యేకంగా 20 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్‌లు 145 శాతానికి చేరింది. మొత్తానికి ఈ పరస్పర సుంకాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత పెరిగినైట్టెంది.
Also Read..
China | మేం చైనీయులం.. కవ్వింపులకు భయపడబోం.. అమెరికాకు చైనా హెచ్చరిక
Donald Trump | జిన్‌పింగ్ చాలా స్మార్ట్.. టారిఫ్ వార్ వేళ చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు