China | చర్చలకు మా తలుపులు తెరిచే ఉంటాయి.. బెదిరింపులు, బ్లాక్మెయిల్ వంటివి పనిచేయవు : ట్రంప్‌కు చైనా కౌంటర్
China | అగ్రరాజ్యం అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి.
China | అగ్రరాజ్యం అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. డ్రాగన్‌పై అమెరికా భారీగా (125 శాతం) ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇక సుంకాలపై అమెరికాతో చైనా ఒప్పందం కుదుర్చుకుంటుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చర్చించేందుకు జిన్‌పింగ్ నుంచి మాకు ఫోన్ కాల్ వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది. ఈ మేరకు కౌంటర్ ఇచ్చింది. చర్చలకు తమ తలుపులు తెరిచే ఉంటాయని వెల్లడించింది. తాము ఘర్షణకు ప్రయత్నించబోమని, ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ‘చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. కవ్వింపు చర్యలకు భయపడం. అమెరికా మాట్లాడాలనుకుంటే.. మా తలుపులు తెరిచే ఉంటాయి. కానీ పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా సంభాషణ జరగాలి. ఒత్తిడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్ వంటివి పనిచేయవు’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హి యోంగ్కియాన్ అన్నారు.
జిన్‌పింగ్ చాలా స్మార్ట్.. ట్రంప్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. జిన్‌పింగ్ చాలా స్మార్ట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ‘జిన్‌పింగ్ చాలా స్మార్ట్. తెలివైన వ్యక్తి. ఎప్పుడు ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. సుంకాలపై వాళ్లు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు జిన్‌పింగ్ నుంచి మాకు ఫోన్ కాల్ వస్తుందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
చైనాపై 125 శాతానికి చేరిన ప్రతీకార సుంకాలు
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు. చైనా మినహా అన్ని దేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. చైనాపై మాత్రం వెంటనే పెంచిన సుంకాలు అమల్లోకి రాగా.. తాజా సవరింపులతో డ్రాగన్‌పై ప్రతీకార సుంకాలు గరిష్టంగా 125 శాతానికి చేరడం గమనార్హం. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది (China tariffs).
దీనిపై ఆగ్రహించిన ట్రంప్ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్‌లు 104 శాతానికి చేరాయి. అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్ బుధవారం మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది. మొత్తానికి ఈ పరస్పర సుంకాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత పెరిగినైట్టెంది.
Also Read..
Donald Trump | జిన్‌పింగ్ చాలా స్మార్ట్.. టారిఫ్ వార్ వేళ చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు
Trump Tariffs | ట్రంప్ టారిఫ్‌లు వాయిదా.. చైనా మినహా మిగతా దేశాలపై 90 రోజులు ఆపేసిన అమెరికా
Donald Trump | ఔషధాలపై సుంకాలు.. ఫార్మా ఉత్పత్తులనూ వదలని డొనాల్డ్ ట్రంప్!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

