శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 20, 2021 , 18:46:17

ఈ చెడ్డీలు ఎన్ని రోజులైనా తొడుక్కోవచ్చంటా..!

ఈ చెడ్డీలు ఎన్ని రోజులైనా తొడుక్కోవచ్చంటా..!

మనం ఏదైనా బయటి ప్రదేశానికి వెళ్లినప్పుడు అండర్‌వేర్‌ మిస్‌ అయితే ఎంతో బాధపడుతాం. దాన్ని అలాగే తొడుక్కోవడం ఇష్టం లేక, కొత్తది కొనుక్కోలేక చాలా ఇబ్బందిపడతాం. కొందరు దాన్నే ఉతికి ఆరేసి మళ్లీ వినియోగిస్తుంటారు. మిగతా దుస్తుల మాదిరిగా అండర్‌వేర్‌ను ఒకటి కంటే ఎక్కువ రోజులు వాడటం వలన దుర్వాసన వేసి ఇబ్బందికరంగా ఉంటుంది. ఫలితంగా ఫంగస్‌ తయారై వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఈ ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేసేందుకు హెర్క్లియోన్‌ అనే సంస్థ కొత్త రకం అండర్‌వేర్‌ను కనుక్కొన్నది. అన్ని రకాల దుస్తుల మాదిరిగా ఈ రకం అండర్‌వేర్లను ఒకటి, రెండు రోజులు కాదు.. వారం కాదు.. నెల రోజుల వరకు ఉతకాల్సిన అవసరం లేకుండా తిరిగి వినియోగించుకునేలా ‘క్రిబి’ పేరుతో అండర్‌వేర్‌ను సిద్ధం చేసింది.

మిన్నెసోటాకు చెందిన హెర్క్లియోన్‌ అనే సంస్థ ఈ రకం అండర్‌వేర్స్‌తో ముందుకు వచ్చింది. ఇవి స్థిరమైనవి మాత్రమే కాకుండా స్వయంగా శుభ్రం చేసుకుంటాయి. వెదురు, యూకలిప్టస్, బీచ్‌వుడ్‌, రాగి మిశ్రమం కలిసిన హెర్క్‌ ఫైబర్‌ అనే ఫ్యాబ్రిక్‌ నుంచి ఈ రకం లోదుస్తులు తయారవుతున్నాయని కంపెనీ తెలిపింది. హెర్క్‌ఫైబర్ నుంచి తయారవుతున్న ఈ లోదుస్తులు ఎక్కువ కాలం తాజాగా, శుభ్రంగా ఉంటాయని కంపెనీ పేర్కొంటున్నది. క్రిబి నిరంతరం అన్ని బ్యాక్టీరియాలను నాశనం చేస్తుందని హెర్క్లియోన్‌ సంస్థ చెప్తున్నది. వీటిని ఒకరోజు వాడిని తర్వాత ఆరు బయట కొద్దిసేపు ఆరవేసిన తర్వాత తిరిగి ధరించవచ్చునని సంస్థ తెలిపింది. క్రిబి 100 రోజుల వరకు రిస్క్ మరియు వాసన లేనిది అని కంపెనీ పేర్కొంటున్నది. హెర్క్లియోన్‌ సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే పలు వస్తువులు కూడా క్రిబి అండర్‌వేర్‌ మాదిరిగానే నీటిని వినియోగించి శుభ్రం చేయాల్సిన పని ఉండదు. ఇదే సంస్థ నుంచి సెల్ఫ్‌ క్లీనింగ్‌ సాక్సులు, టీషర్టులు, బెడ్‌షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ అండర్‌వేర్‌ దుస్తుల ఆలోచన ఎలా వచ్చిందో హెర్క్లియోన్ వ్యవస్థాపకుడు వెన్సెలాస్ వివరించారు. ముయెని ఐస్‌ల్యాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందంట. ఈ పర్యటనకు వెళ్లినప్పుడు బ్యాక్‌ప్యాక్‌లో ఒకరోజుకు సరిపడా దుస్తులను ప్యాక్ చేసుకుని అండర్‌వేర్‌ మరిచిపోయాడు. మరుసటి రోజు లోదుస్తుల నుంచి దుర్వాసన రావడంతో వారం రోజులపాటు ధరించినా దుర్వాసన రాకుండా ఉండే అండర్‌వేర్‌ను కనుక్కోవాలని దానికి సంబంధించి అధ్యయనం చేసి చివరకు సాధించానని చెప్తున్నాడాయన. ప్రపంచాన్ని సహజంగా శుభ్రంగా, పర్యావరణ అనుకూల భవిష్యత్‌ వైపు నడిపించడానికి తమ సంస్థ కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని వెన్నెలాస్‌ చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

వ్యాక్సిన్‌ కోసం వేషం మార్చి అడ్డంగా బుక్కయ్యారు..

లాకర్ల భద్రత బాధ్యత బ్యాంకులదే : సుప్రీంకోర్టు

ఈ నకిలీ యాప్‌తో జాగ్రత్త.. దోచుకుంటారు..

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. మోతేరా

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo