న్యూఢిల్లీ : (Secret Blacklist) ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫేస్బుక్.. మరో చిక్కుల్లో పడింది. ఫేస్బుక్ రాసుకున్న ‘రహస్య బ్లాక్‌లిస్ట్’ లీక్ కావడంతో ఫేస్బుక్ కొంప ముంచేలా కనిపిస్తున్నది. ఈ రహస్య బ్లాక్‌లిస్ట్‌లో భారతదేశంలో 10 ప్రమాదకరమైన సంస్థల పేర్లు ఉండటమే దీనికి కారణం.
అల్లర్లను ప్రేరేపించడం, నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థల బ్లాక్‌లిస్ట్‌ను ఫేస్బుక్ రాసుకున్నది. ఈ జాబితాను ఇప్పటి వరకు ఫేస్బుక్ రహస్యంగా ఉంచుకున్నది. అయితే, అమెరికా వార్తా వెబ్సైట్ ‘ది ఇంటర్సెప్ట్’ ఈ జాబితాను లీక్ చేసింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంస్థలు, వ్యక్తుల పేర్లున్నాయి. భారతదేశంకు సంబంధించి హిందూత్వ గ్రూపు సనాతన్ సంస్థ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మావోయిస్ట్ వంటి 10 సంస్థల పేర్లు చేర్చారు.
వాస్తవానికి, ఫేస్బుక్ తన ప్లాట్‌ఫాంలో అల్లర్లను ప్రేరేపించడం, నేర కార్యకలాపాలను నిరోధించడానికి బ్లాక్ జాబితాను సిద్ధంగా ఉంచుతుంది. కంపెనీ దీనికి ‘సీక్రెట్ డేంజరస్ వ్యక్తులు, సంస్థల జాబితా’ అని పేరు పెట్టింది. ది ఇంటర్సెప్ట్ అనే వార్తా వెబ్సైట్ దీనిని యాక్సెస్ చేసి తన వెబ్సైట్లో ప్రచురించింది.
ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ 2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- మావోయిస్ట్ 3. కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ 4. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ 5. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఇసాక్-ముయివా టెర్రర్ సౌత్ ఆసియా) 6. కంగ్లీపాక్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ 7. సనాతన సంస్థ 8. దావత్-ఎ-హక్ టెర్రరిస్ట్ మీడియా వింగ్ ఇస్లామిక్ స్టేట్ 9. అల్-బదర్ ముజాహిదీన్ 10. ఆలం మీడియా టెర్రర్ ఇండియా మీడియా వింగ్ అన్సార్ గజావత్-ఉల్-హింద్
2012 లో ఫేస్బుక్ తన ప్లాట్‌ఫాంను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించింది. అప్పటి నుంచి తన ప్లాట్‌ఫాం వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలను ఆపడానికి కొన్ని సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేయడం ఈ సోషల్ మీడియా సంస్థ ప్రారంభించింది. ‘ది ఇంటర్సెప్ట్’ నివేదిక ప్రకారం, ఫేస్బుక్ ఇప్పటివరకు 4,000 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థలు, దవాఖానలు ఉన్నాయి. ఇలాఉండగా, ఇంటర్సెప్ట్ జారీ చేసిన బ్లాక్‌లిస్ట్‌ను ఫేస్బుక్ సంస్థ వ్యతిరేకించలేదు. అయితే, ఈ జాబితాను రహస్యంగా ఉంచుతామని మాత్రమే ఫేస్బుక్ చెప్పడం విశేషం.
వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్‌గా రిలయన్స్.. ఫోర్బ్స్ వెల్లడి
కెప్టెన్‌తో చన్నీ భేటీ.. పంజాబ్‌లో కొత్త ఈక్వేషన్స్
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్..!
బంగ్లాదేశ్‌లోని ఆలయాలపై దాడులు, పండల్స్ ధ్వంసం
ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!
కొవిడ్ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు
నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..