Channi met Captain : కెప్టెన్‌తో చన్నీ భేటీ.. పంజాబ్‌లో కొత్త ఈక్వేషన్స్
Channi met Captain : పంజాబ్ రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా పంజాబ్‌లో కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు...

జలంధర్ : (Channi met Captain) పంజాబ్ రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా పంజాబ్‌లో కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటివరకు తన మనిషిగా భావించిన చరంజీత్ చన్నీ, ముఖ్యమంత్రిగా నియమితులవగానే తన మాట వినడం లేదనే అభిప్రాయం సిద్ధూలో వచ్చింది. తన మాటకు చన్నీ గౌరవం ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా సమర్పించారు. పార్టీ పెద్దల సమక్షంలో చర్చించి కమిటీ వేసినప్పటికీ సిద్ధూ శాంతించకపోవడంతో.. చన్నీ మరో మార్గం ఎంచుకున్నారు. అదే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో భేటీ కావడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా తయారైంది.
సిద్ధూతో బెడిసిన తర్వాత పంథాను మార్చుకున్న చన్నీ, గురువారం కుటుంబసమేతంగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కలిశారు.భార్య, కుమారుడు, కోడలుతో కలిసి కెప్టెన్ వద్దకు చన్నీ వెళ్లారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత కెప్టెన్‌ను చన్నీ కలువడం ఇదే మొదటిసారి. అమరీందర్‌ను ముఖ్యమంత్రిగా తొలగించిన తర్వాత చన్నీని సీఎంగా ఎంపిక చేయగానే.. చన్నీని కెప్టెన్ భోజనానికి పిలిచి తన పెద్ద మనుసు చాటుకున్నాడు. అయితే, బిజీగా ఉన్నందున కెప్టెన్ ఆహ్వానాన్ని చన్నీ తిరస్కరించాడు. వీరి భేటీ సిస్వాన్‌లోని కెప్టెన్ ఫామ్ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశం ఎజెండా వెల్లడికాలేదు.
అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన నలుగురు అసమ్మదీయుల్లో చన్నీ కూడా ఉండటం విశేషం. అయితే, సిద్ధూతో బెడిసిన అనంతరం శత్రువుకు శత్రువు మిత్రుడనే దాన్ని చన్నీ నిజం చేసి చూపుతున్నారు. పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ అనుభవం దృష్ట్యా కొత్త రాజకీయ వాటాలు బయటపడవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్..!
బంగ్లాదేశ్‌లోని ఆలయాలపై దాడులు, పండల్స్ ధ్వంసం
ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!
కొవిడ్ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు
నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

