Attack on Temples : బంగ్లాదేశ్‌లోని ఆలయాలపై దాడులు, పండల్స్ ధ్వంసం
Attack on Temples : బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులకు పాల్పడ్డారు. దుర్గా పూజ సందర్భంగా ఏర్పాటుచేసిన...

ఢాకా : (Attack on Temples) బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడులకు పాల్పడ్డారు. దుర్గా పూజ సందర్భంగా ఏర్పాటుచేసిన పండల్స్ లక్ష్యంగా దాడులు జరిగాయి. పండల్స్లో ఏర్పాటుచేసిన పలు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో విజయదశమిని పురస్కరించుకుని ఎప్పటిమాదిరిగానే హిందూ సంస్థలు పండళ్లను ఏర్పాటుచేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాయి. ఈ పూజలంటే గిట్టని చాందసవాదులు చంద్పూర్ జిల్లాలోని హిందూ దేవాలయంపై గుంపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కాల్పులు చోటుచేసుకోవడంతో ముగ్గురు హతమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాలయాలపై ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం అందింది. బంగ్లాదేశ్ చరిత్రలో ఇది దుర్దినం అని, ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ విజ్ఞప్తిచేసింది.
బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ముస్లింలు కోరుకోకపోతే హిందువులు పూజలు చేయరని, ఇదే సమయంలో సైన్యాన్ని రంగంలోకి దించైనా ఇక్కడి హిందువులను రక్షించాలని కౌన్సిల్ ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!
కొవిడ్ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు
నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

