Naresh | ఢిల్లీ ఉద్రిక్తతలపై నటుడు నరేష్ స్పందన.. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలపై సమగ్ర విచారణ జరగాలి..
Naresh | ఢిల్లీలో జరిగిన 'ఛలో పార్లమెంట్' నిరసన కార్యక్రమం ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Naresh | ఢిల్లీలో జరిగిన ‘ఛలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమం ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఆందోళనకారులు బారికేడ్లను దాటి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నట్లు, పలు వాహనాలు ధ్వంసమైనట్లు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనల్లో పోలీసు సిబ్బందితో పాటు పలువురు నిరసనకారులు కూడా గాయపడినట్లు సమాచారం.
ఈ పరిణామాలపై స్పందించిన నరేష్, తన సోషల్ మీడియా పోస్టులో నీట్ పేపర్ లీక్ అంశం తీవ్ర ప్రాధాన్యత కలిగిన సమస్యేనని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని మరింత సమర్థవంతంగా నిర్వహించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే పరీక్షలు పూర్తై ఫలితాలు విడుదలైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రశ్నలకు తావిస్తున్నాయని అన్నారు.ఘర్షణల్లో గాయపడిన పోలీసు సిబ్బందిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనల వెనుక మరేదైనా పెద్ద కుట్ర కోణం ఉందా అనే అంశాన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని నరేష్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు లేదా సంఘవిద్రోహ శక్తుల ప్రమేయం ఉంటే వాటిని అత్యంత తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు.
అలాగే, శాంతియుత నిరసన ప్రతి ప్రజాస్వామ్య దేశంలో పౌరుల హక్కేనని, కానీ హింసకు పాల్పడటం లేదా యువతను తప్పుదోవ పట్టించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరాదని నరేష్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి సంఘటనలపై పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరగాలని ఆయన తన పోస్టులో కోరారు. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఈ అంశంపై చర్చ కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

