e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home News చరిత్రలో ఈరోజు : 3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్‌

చరిత్రలో ఈరోజు : 3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్‌

(చరిత్రలో ఈరోజు) భారత రాజ్యంగ రచయిత డాక్టర్‌ భీంరావ్‌ అంబేడ్కర్‌ దాదాపు 3.65 లక్షల మంది మద్దతుదారులతో కలిసి 1956 లో సరిగ్గా ఇదే రోజున బౌద్ధమతం స్వీకరించారు. స్వతహాగా హిందువు అయిన అంబేడ్కర్‌.. బుద్ధుడి బోధనలకు ఆకర్శితుడై నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ భారీ కార్యక్రమంలో బౌద్ధమతం స్వీకరించారు. తనతో పాటు బౌద్ధమతం స్వీకరించిన వారి కోసం అంబేడ్కర్‌ 22 ప్రతిజ్ఞలు అందించారు. ఈ సందర్భంగా హిందూ మతంలో ఆచరించే ధర్మాలు, పూజా పద్ధతులను పూర్తిగా విడనాడుతున్నట్లు వారితో ప్రమాణం చేయించారు. స్వేచ్ఛ, సమానత్వం బోధించే బౌద్ధమతం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆనాటి సభలో మాట్లాడిన అంబేడ్కర్‌ చెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలో జన్మించిన అంబేడ్కర్‌.. చిన్నతనం నుంచే వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. పాఠశాలలో చివరి వరుసలో ఆయనను కూర్చోబెట్టడంతో.. ఇక్కడ నుంచే ఈ వివక్ష వ్యవస్థకు వ్యతిరేకిగా మారారు. ‘నేను హిందువుగా పుట్టాను. అది నా నియంత్రణలో లేదు. అయితే, హిందువుగా మాత్రం చనిపోను. ఎందుకంటే అది నా నియంత్రణలో ఉంటుంది’ అని 1935 అక్టోబర్‌ 13 న మహారాష్ట్ర యెవాలాలో నిర్వహించిన ఒక సభలో అంబేడ్కర్‌ చెప్పడం ఆయన హిందూ ధర్మం పట్ల ఎంత వ్యతిరేకతను కలిగి ఉన్నారో విశదీకరిస్తుంది.

- Advertisement -

హిందూ మతంలో ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థను అంతం చేయడానికి చట్టాన్ని కూడా ఆశ్రయించాడు. తాను కోరుకున్న మార్పులు బహుశా ఎన్నటికీ జరుగవని భావించారు. దాంతో తనకు మద్దతుగా నిలిచిన దాదాపు 3.65 లక్షల మందిని కూడగట్టి నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో బౌద్ధమతం స్వీకరించారు. ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే ఈ మతం అంటే నాకు వల్లమాలిన ఇష్టం. మహిళలు సాధించిన స్థాయిని బట్టి సంఘం పురోగతిని కొలుస్తాను. మతం మనిషి కోసం, మతం కోసం మనిషి కాదు’ అని పిలుపునిచ్చారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2010: రాజధాని ఢిల్లీలో ముగిసిన 19 వ కామన్వెల్త్ క్రీడలు

2008: మ్యూచువల్ ఫండ్స్ అవసరాలను తీర్చేందుకు 200 బిలియన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ

2007: వైద్య, వ్యవసాయ రంగాలలో న్యూక్లియర్ టెక్నాలజీని ఉపయోగించేందుకు నేపాల్‌కు ఆమోదం తెలిపిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ

2004: అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఆర్మీ చీఫ్‌గా కూడా కొనసాగించే బిల్లును ఆమోదించిన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ

1953: భారతదేశంలో అమలులోకి వచ్చిన ఎస్టేట్ డ్యూటీ చట్టం

1946: హాలండ్-ఇండోనేషియా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

1882: సిమ్లాలో పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రారంభం

1981 : ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా హోస్ని ముబారక్‌ ఎన్నిక

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇమ్రాన్‌ఖాన్‌-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?

పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్‌ అధ్యయనం

సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!

ట్రంప్‌కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement