Attack in Norway : నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
Attack in Norway : ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నార్వేలో అలజడి చెలరేగింది. నార్వేజియన్ నగరమైన కాంగ్స్బర్గ్లో మంగళవారం-బుధవారం రాత్రి...

కాంగ్స్బర్గ్ : (Attack in Norway) ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నార్వేలో అలజడి చెలరేగింది. నార్వేజియన్ నగరమైన కాంగ్స్బర్గ్లో మంగళవారం-బుధవారం రాత్రి ఒక వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల ప్రకారం, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడి గురించి గానీ, మరణించిన వారి గురించి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఉగ్రవాద దుశ్చర్యనా? లేక శుత్రుత్వంతో చేసిందా? అనేది ఇంకా తెలియరాలేదు.
కాంగ్స్బర్గ్లోని కూపే ఎక్స్ట్రా సూపర్మార్కెట్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి అక్కడున్న వారిపై బాణంతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అక్కడ ఉన్న ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఇప్పడు ఇంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేమని కాంగ్స్బర్గ్ పోలీస్ చీఫ్ ఒవిండ్ ఆస్ అన్నారు. ఒవిండ్ ఆస్ ప్రకారం, దాడి చేసిన వ్యక్తి మొదట నగరంలోని రద్దీ కూడలిలో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాడు. అనంతరం ఇటు వైపు పరుగెత్తాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఘటనా స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రెమెన్ ప్రాంతం నుంచి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమయంలో అతను పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
ఇమ్రాన్‌ఖాన్-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

