న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కొన్ని ప్రదేశాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే సీజేపీ కార్యకర్తలు కూడా ఓ సందర్భంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్(RAF jawan)పై విరుచుకుపడ్డారు. ఓ ఆర్ఏఎఫ్ జవాన్‌ను పట్టుకుని కొట్టారు. కిందపడేసి తన్నారు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఛేజింగ్ చేసి మరీ ఆర్ఏఎఫ్ జవాన్‌ను చితకబాదారు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఘటన పట్ల కేసు బుక్ చేశామని, దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు చెప్పారు. ఆర్ఏఎఫ్ జవాన్‌ను చితకబాదిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు పోలీసులు తెలిపారు.
Visuals from Jantar Mantar
A RAF jawan was brutally beaten by a mob of around 100 CJP protesters in the middle of the road. 💔💔 pic.twitter.com/knfq27QfZ9
— Saffron 🕠 (@Saffron__Archer) July 21, 2026