e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 29, 2021
Home News Music and Masquitoes : దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్‌‌..!

Music and Masquitoes : దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్‌‌..!

(Music and Masquitoes) ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమలు రాజ్యమేలుతున్నాయి. వీటి కారణంగా ప్రజలు డెంగీతో పాటు వివిధ వ్యాధుల బారినపడుతున్నారు. ఫలితంగా దవాఖానలు అన్నీ రోగులతో నిండిపోతున్నాయి. దోమలను నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మనలో అవగాహన లోపించిన కారణంగా వాటి జనాభా నానాటికీ పెరిగిపోతున్నది. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు డెంగీ వ్యాప్తి నివారణలో పోరాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఈసారి కొత్త డెంగ్యూ జాతి ‘సెరోటైప్-2’ కేసులు కనిపిస్తున్నాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ పరిశోధన ప్రకారం, డెంగీ సెరోటైప్-2 చాలా తీవ్రమైన సమస్యలతో ప్రాణాంతకం కావచ్చు. ఈ పరిస్థితిలో దోమల నుంచి రక్షణ పొందడం చాలా అవసరం.

దోమలను వదిలించుకోవడానికి మనం వివిధ రకాల రసాయన ఉత్పత్తులు ఉపయోగిస్తుంటాం. వీటి వల్ల కొద్దిగా ఉపశమనం ఉన్నప్పటికీ పూర్తిగా దూరం చేసుకోలేకపోతున్నాం. అయితే, బిగ్గరగా సంగీతం పెట్టడం దోమ కాటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇది కొంచెం వింతగా అనిపించినా.. ముమ్మాటికీ నిజం అంటున్నారు పరిశోధకులు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సర్వే ప్రకారం, దోమలు అధిక పౌనః పున్య ధ్వనిని అస్సలే ఇష్టపడవు. ఈ పరిస్థితుల్లో దోమలు వాటి సంఖ్యను కూడా పెంచలేవు.

స్మార్ట్‌ఫోన్ల ద్వారా కూడా..

- Advertisement -

స్మార్ట్‌ ఫోన్ల ద్వారా కూడా దోమలను మన దగ్గరకు రాకుండా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్నో రకాల దోమల రెపెల్లెంట్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు ఈ యాప్‌లను గూగుల్‌ పే నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దోమలు ఈ యాప్‌ల నుంచి వచ్చే అధిక-ఫ్రీక్వెన్సీ ధ్వనిని ఏమాత్రం ఇష్టపడవు. అవి ధ్వని వినిపించే గాడ్జెట్స్‌ ఉండే ప్రాంతాల్లో కూడా ఎగరవు. ఈ యాప్‌లను ఆన్ చేసినప్పుడు.. వివిధ మోతాదుల్లో తరంగాలు వెలువడతాయి. ఇది దోమలు, ఈగలు పారిపోయేలా చేస్తుంది. ఈ తరంగాలు మానవులకు ప్రమాదకరమైనవి కావు. పెద్ద గదుల్లో మొబైల్ ఫోన్ స్పీకర్‌ను ఆన్ చేసి ఉంచడం ద్వారా వీటిని దూరంగా పంపేయవచ్చు.

దోమలకు చెవులుంటాయా?

దోమలు దాదాపు 2,000 హెడ్జ్‌ వినికిడి పరిధిని కలిగి ఉంటాయి. మగ దోమలకు వినికిడి శక్తి ఎక్కువ. ఆడ దోమలు చెవిటివిగా చాలా కాలం పాటు భావించారు. అయితే, 2006 లో ‘కరెంట్ బయాలజీ’ లో ప్రచురితమైన గాబ్రియేలా గిబ్సన్, ఇయాన్ రస్సెల్ పరిశోధన ఆడ దోమలు కూడా వినగలవని స్పష్టం చేసింది. తలపై ఉండే రెండు రెక్కల యాంటెన్నాల ద్వారా దోమలు ధ్వనిని వింటాయి. వీటి సాయంతోనే మనుషులను పసిగట్టి దగ్గరగా వస్తాయి. మనం విడిచే కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఆధారంగా దోమలు 30 ఫీట్ల దూరం నుంచే మనల్ని గుర్తిస్తాయి. చెమటను త్వరగా పసిగట్టడం ద్వారా కూడా దోమలు మనల్ని చేరి కుడతాయని మరో పరిశోధనలో తేలింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

బంగ్లాదేశ్‌లోని ఆలయాలపై దాడులు, పండల్స్‌ ధ్వంసం

ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!

కొవిడ్‌ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు

నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి

3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement