Gold Rates | గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. (Gold, Silver Price) అంతే వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం ఆల్టైమ్ హై రికార్డులతో పరుగులు పెట్టిన రేట్లు.. ఇప్పుడు రివర్స్ గేర్ తీసుకున్నాయి. నేడు వరుసగా రెండో రోజుకూడా బంగారం ధరలు తగ్గాయి.
మార్కెట్ వర్గాల ప్రకాం.. గురువారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,880కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,390గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,030గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,15,540గా ఉంది. అటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,74,900గా ఉంది. ఇక బుధవారం ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5వేల వరకూ తగ్గిన విషయం తెలిసిందే.
Also Read..
SpiceJet | పాట్నా వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీకి దారిమళ్లింపు
Heavy Rain | భారీ వర్షాలు.. నేడు ఈ ఐదు జిల్లాలకు అలర్ట్
PM Modi | మలేసియాలో ట్రంప్ – మోదీ భేటీ లేనట్లే.. ఆసియాన్ సదస్సులో వర్చువల్గా పాల్గొననున్న ప్రధాని