PM Modi | మలేసియా (Malaysia)లో ఈ నెల ఆసియాన్ సదస్సు (ASEAN summit) జరగనున్న విషయం తెలిసిందే. కౌలాలంపూర్‌లో అక్టోబరు 26 నుంచి 28 వరకు జరగనున్న ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ప్రకటించారు. ఈ సమ్మిట్‌లో వర్చువల్ (virtually)గా పాల్గొననున్నట్లు తెలిపారు. ఆసియాన్-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఈ సదస్సు నేపథ్యంలో మలేషియాతోపాటూ కంబోడియాలో కూడా ప్రధాని పర్యటించాలని తొలుత భావించారు. అయితే, తాజాగా ఆయన ఈ సదస్సుకు వెళ్లకపోవడంతో.. కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల నాయకులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ గైర్హాజరు నేపథ్యంలో ట్రంప్ – మోదీ భేటీ (Modi-Trump meeting) ఈసారి కూడా లేనట్లే. ఈ ఆసియాన్‌లో మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.
Had a warm conversation with my dear friend, Prime Minister Anwar Ibrahim of Malaysia. Congratulated him on Malaysia’s ASEAN Chairmanship and conveyed best wishes for the success of upcoming Summits. Look forward to joining the ASEAN-India Summit virtually, and to further…
— Narendra Modi (@narendramodi) October 23, 2025
Also Read..
Donald Trump | మోదీ మాటిచ్చారు.. ఈ ఏడాది చివరినాటికి.. : ట్రంప్ నోట మళ్లీ అదేమాట
Russian oil companies | మాస్కోపై ట్రంప్ కఠిన చర్యలు.. రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలు
Donald Trump: పుతిన్‌తో మీటింగ్ రద్దు : ట్రంప్