Russian oil companies | రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం (Russia-Ukraine War) ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ‘రష్యా చమురు’ను ట్రంప్ టార్గెట్ చేశారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ఇప్పటికే అధిక టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.
ఇక ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో పుతిన్ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్.. రష్యాపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలపై (Russian oil companies) ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ (OFAC) బుధవారం ప్రకటించింది. రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ (Rosneft), లుకాయిల్ (Lukoil) అనే రెండు ప్రధాన చమురు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడమే కాకుండా శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేకపోవడం వల్లే మాస్కో యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూరుస్తున్న ఈ రెండు ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ‘మేము ఆశించినట్లుగా ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో పుతిన్ నిజాయితీగా ముందుకు రావడంలేదు. అందుకు అధ్యక్షుడు తీవ్ర నిరాశకు గురయ్యారు’ అని పేర్కొంది. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. పుతిన్‌తో ట్రంప్ భేటీ వాయిదా పడిన నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read..
Donald Trump: పుతిన్‌తో మీటింగ్ రద్దు : ట్రంప్
హెచ్1బీ వీసాదారులు వద్దు.. నియామకాలు నిలిపివేసిన వాల్‌మార్ట్!
OpenAI | క్రోమ్‌కు పోటీగా అట్లాస్.. గూగుల్‌కు ఓపెన్ఏఐ సవాల్